విక్రమ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

కొన్ని నెలల క్రితం వరకు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని లోకేశ్ కనగరాజ్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది.టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం లోకేశ్ కనగరాజ్ తో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

 Interesting Facts About Vikram Director Lokesh Kanagaraj Details Here , Lokesh K-TeluguStop.com

అయితే లోకేశ్ కనగరాజ్ గురించి అభిమానులకు ఎక్కువగా తెలియదు.గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపుల వల్ల ఇబ్బందులు పడుతున్న కమల్ హాసన్ కు విక్రమ్ సినిమాతో కోరుకున్న సక్సెస్ దక్కిందనే సంగతి తెలిసిందే.

ఈ సినిమా సక్సెస్ వల్ల లోకేశ్ కనగరాజ్ రెమ్యునరేషన్ సైతం ఊహించని స్థాయిలో పెరిగింది.36 సంవత్సరాల వయస్సులోనే కనీవిని ఎరుగని విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకులలో లోకేశ్ కనగరాజ్ ఒకరు కావడం గమనార్హం.కమల్ హాసన్ కు వీరాభిమాని అయిన లోకేశ్ కనగరాజ్ ఈ సినిమా ద్వారా కమల్ హాసన్ కోరుకున్న సక్సెస్ దక్కేలా జాగ్రత్త పడ్డారు.విక్రమ్ సినిమా ఏకంగా 300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే.

లోకేశ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు మూవీ ఫ్లాప్ అవుతుందనే భయం ఎక్కువని సినిమా ఫ్లాప్ అయిందంటే 200 రూపాయలు ఖర్చు చేసి టికెట్ కొనే ప్రేక్షకుడు కూడా ఫెయిల్ అయినట్టేనని లోకేశ్ కనగరాజ్ చెప్పుకొచ్చారు.ఈ కారణం వల్లే నేను ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేస్తానని ఆయన వెల్లడించారు.

ఎంబీఏ చదివిన లోకేశ్ కనగరాజ్ నాలుగేళ్లు ప్రైవేట్ జాబ్ చేశారు.అచమ్ థావిర్ అనే షార్ట్ ఫిల్మ్ తో ఆయన ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు.

Telugu Vikram-Movie

మా నగరం, ఖైదీ, మాస్టర్ సినిమాల విజయాలతో లోకేశ్ కనగరాజ్ కు క్రేజ్ పెరిగింది.లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలన్నీ నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను అందించాయి.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చరణ్ లోకేశ్ కు సన్నిహితుడు కావడం గమనార్హం.చరణ్ కు లోకేశ్ కనగరాజ్ ఇప్పటికే రెండు కథలు చెప్పారు.టాలీవుడ్ స్టార్స్ సైతం లోకేశ్ కనగరాజ్ తో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube