మనలో చాలామంది సెలబ్రిటీలకు ఎటువంటి కష్టాలు ఉండవని అనుకుంటారు.అయితే స్టార్ కిడ్ అయినప్పటికీ తను ఎన్నో కష్టాలను అనుభవించానని ఇషా డియోల్ చెప్పుకొచ్చారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ కపుల్స్ లో ధర్మేంద్ర హేమా మాలిని జోడీ ఒకటనే సంగతి తెలిసిందే.ధర్మేంద్రకు హేమా మాలిని రెండో భార్య కాగా ఈ దంపతులకు అహనా డియోల్, ఇషా డియోల్ పేర్లతో ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
అహనా డియోల్ పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా ఇషా డియోల్ పలు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్నారు.తాజాగా ఇషా డియోల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తన తల్లిదండ్రుల గొప్పదనం గురించి ఇషాడియోల్ చెప్పుకొచ్చారు.తన తల్లి, తండ్రి ఇద్దరూ సూపర్ స్టార్స్ అని అయినప్పటికీ తల్లిదండ్రులు ఎప్పుడూ డౌన్ టు ఎర్త్ ఉండేవారని ఆమె చెప్పుకొచ్చారు.

తన తల్లిదండ్రులు తమను ఎంతో బాగా పెంచారని సాధారణంగానే తన బాల్యం గడిచిందని ఇషా డియోల్ అన్నారు.పాఠశాలలో చదివే సమయంలో కూడా తనను, తన చెల్లిని ఎవరూ స్టార్ కిడ్ లా చూసేవారు కాదని ఆమె చెప్పుకొచ్చారు.తాను, తన చెల్లి పాఠశాలకు రోజూ రిక్షాలోనే వెళ్లేవాళ్లమని ఆమె అన్నారు ఏక్ దువా అనే సినిమాతో ఇషా డియోల్ మంచి పేరును సొంతం చేసుకున్నారు.