సలార్ సినిమాలోని కాటేరమ్మ దేవత వెనుక కథ తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఆ ఉగ్ర రూపమే దేవతగా వెలిశారా?

సలార్ సినిమా ( Salaar movie )బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు ఫుల్ రన్ లో 730 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.

 Interesting Facts About Salaar Kateramma God Details Here Goes Viral , Salaar,-TeluguStop.com

సలార్ రేంజ్ కు ఈ మొత్తం తక్కువే అయినా రిలీజ్ డేట్ మారడం, సరైన రేంజ్ లో ప్రమోషన్స్ లేకపోవడం ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపినట్టు ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ఈ సినిమాలో కాటేరమ్మ దేవత( Goddess Kateramma ) గురించి ప్రస్తావన ఉంటుంది.

ఆ దేవత విగ్రహం కూడా హైలెట్ అయింది.

అయితే ఈ దేవత కథ గురించి తెలిసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.

తమిళనాడులో కాటేరీ అమ్మన్ గా పూజించబడే ఈ దేవత కర్ణాటకలో( Karnataka ) కాటేరమ్మగా పిలవబడతారు.పార్వతీదేవి( Goddess Parvati ) మరో రూపంగా ఈ అమ్మను కొలుస్తారు.

పురాణాల ద్వారా తెలుస్తున్న విషయాల ప్రకారం శివుడు కైలాసంలో నిద్రించే సమయంలో పార్వతీదేవి ఎక్కడికో వెళ్తూ సూర్యోదయానికి ముందు కైలాసానికి చేరుకునేది.

Telugu Salaar, Goddess Parvati, Kateramma, Prabhas-Movie

ఈ చర్య గురించి శివుడు పార్వతిని నిలదీయగా తన ప్రమేయం లేకుండానే ఈ విధంగా జరిగిందని పార్వతీదేవి చెబుతుంది.ఒకరోజు రాత్రి శివుడు పార్వతీదేవిని అనుసరించగా పార్వతీదేవి హఠాత్తుగా కాళిగా మారిపోయి శవాలను తవ్వి తీసి తినే ప్రయత్నం చేస్తుంటుంది.ఆ తర్వాత శివుని కోరిక మేరకు పార్వతీదేవి భయంకరమైన రూపాన్ని ఒక గొయ్యిలో వదిలేస్తుంది.

ఆ వదిలేసిన రూపమే కాటేరమ్మ కావడం గమనార్హం.

Telugu Salaar, Goddess Parvati, Kateramma, Prabhas-Movie

శివుడి శాపం వల్ల ఆమె అడవుల్లో తిరుగుతుందని కూడా మరో కథ ప్రచారంలో ఉంది.ఈ దేవతను భక్తులు బలి దేవతగా కొలుస్తారు.కొన్నిచోట బలి లేకుండా ప్రసాదాలతో ఈ దేవతను కొలుస్తారు.

సలార్ మూవీ రిలీజ్ తర్వాత కాటేరమ్మ గురించి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.కాటేరమ్మ విగ్రహానికి సంబంధించిన ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube