మానవ స్వభావంపై ఈ శాస్త్రీయ ఆవిష్కరణల గురించి మీకు తెలుసా?

Interesting Facts About Human Behavior Human Behavior, Psychology , Multi Tasker , Cornell University , Mobile Phones. Mind

శతాబ్దాలుగా మనిషి ప్రధాన అంశంగా పలు పరిశోధనలు జరుగుతున్నాయి.శాస్త్రవేత్తలు మానవునికి సంబంధించిన ప్రతి అంశాన్ని లోతుగా అన్వేషిస్తున్నారు.

 Interesting Facts About Human Behavior Human Behavior, Psychology , Multi Tasker-TeluguStop.com

మానవ స్వభావం గురించిన పలు ఆసక్తికరమైన శాస్త్రీయ వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం.మనస్తత్వశాస్త్రం ప్రకారం, అబద్ధం చెప్పడానికి చాలా మానసిక శ్రమ అవసరం.

అబద్ధం చెప్పాలంటే మన మెదడు ఎంతో శ్రమించాల్సి ఉంటుంది.అందుకే దగాకోరులు ఎల్లప్పుడూ చిన్న వాక్యాలను ఉపయోగిస్తారు, ఎందుకంటే అబద్ధం చెప్పడానికి పెద్ద వాక్యాల కలయికలను ఉపయోగించడం కష్టం.

డ్యూటీలో పని చేస్తున్నప్పుడు లేదా ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని పర్యవేక్షిస్తే.ఆ సమయంలో తాను పర్యవేక్షించబడుతున్నాడని అతనికి తెలిస్తే, అతను మెరుగైన రీతిలో పని చేయడం ప్రారంభిస్తాడు.

అందమనే రూపం సులభంగా తప్పుదారి పట్టించగలదు.అందంగా కనిపించే వ్యక్తులను విశ్వసించే ధోరణి అందరిలోనూ ఉంది.

దురదృష్టవశాత్తు చాలాసార్లు మనం ఈ ధోరణితో మోసపోతుంటాం.అందంగా కనిపించే వ్యక్తి అబద్ధాలకోరు అయినప్పటికీ, అతనిని నమ్మడం మొదలుపెడతాం.

మనిషి ఒకే సమయంలో రెండు పనులు చేయలేడు.మనమందరం కొన్నిసార్లు ఒకే సమయంలో రెండు పనులు చేయడానికి ప్రయత్నిస్తాము.

(మల్టీ టాస్కింగ్) మనల్ని మనం మల్టీ టాస్కర్ అని అనుకుంటాం.కానీ నిజం ఏమిటంటే మనం ఒకే సమయంలో రెండు పనులను సరిగ్గా చేయలేం.

మన మెదడు ఒకసారి ఒక పని మీదనే తన దృష్టిని కేంద్రీకరించగలదు.కార్నెల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు మానవ స్వభావంపై ఆశ్చర్యకరమైన వాస్తవాలను కనుగొన్నారు.

ఈ అధ్యయన నివేదిక ప్రకారం, మొబైల్ ఫోన్‌లలో 37 శాతం సంభాషణలు అబద్ధాల ఆధారంగా ఉన్నాయి.ఈ నివేదిక ప్రకారం ముఖాముఖి సంభాషణలు మరింత నిజం.

ఎవరైనా గరిష్టంగా 10 నిమిషాల పాటు దృష్టిని ఒకే చోట కేంద్రీకరించ గలుగుతారు.దృష్టిని ఒకే చోట కేంద్రీకరించడంలో మీకు మీరు గొప్పవారను కుంటే అది తప్పవుతుందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube