సత్యజిత్ రాయ్. తొలి భారత ఆస్కార్ అవార్డు గ్రహీత.
ఇది 1992 లో జరిగింది.అయన ఆఖరి దశలో ఉండి, మంచం పై ఉంటె ఆస్కార్ వాళ్ళే వెళ్లి మరి ఆయనకు ఆ అవార్డు అందించారు.
సత్యజిత్ అంటే అవార్డ్స్, అవార్డ్స్ అంటే సత్యజిత్.ఇండియన్ సినిమా పరిశ్రమలో ఆయనకు వచ్చినన్ని అవార్డ్స్ మరెవ్వరికి లేవు.
దాదా సాహెబ్ పాల్కే, భారత రత్న తో పాటు ఆస్కార్ అవార్డు కూడా అయన ఒడిసి పట్టుకున్నారు.ఇక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందిన మొట్ట మొదట భారతీయుడు కూడా ఆయనే కావడం విశేషం.
ఎన్నో జాతీయ అవార్డ్స్ ఆయనను వరించాయి.కేవలం ఆయన తీసింది 37 సినిమాలు మాత్రమే.కానీ తీసిన ప్రతి సినిమాకు కూడా బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు దక్కించుకోవడం అంటే మాములు విషయం కాదు.అలంటి ఒక రికార్డు ప్రపంచం మొత్తం ఎక్కడ వెతికిన దొరకదు.
ఇక అయన తీసిన మొట్ట మొదటి సినిమా పేరు పథేర్ పాంచాలీ.ఈ చిత్రానికి ఏకంగా 11 అంతర్జాతీయ అవార్డ్స్ దక్కడం అంటే మాటలు కాదు.

మరణించడానికి కేవలం 23 రోజుల ముందే ఆస్కార్ అతడికి చేరింది.70 ఏళ్ళ వయసులో కన్ను మూసినా సత్యజిత్ షార్ట్ ఫిలిం, డాక్యూమెంటరీస్ వంటివి కలుపుకొని అతి తక్కువగా 37 సినిమాలు చేసాడు.స్వతహా గా బెంగాలీ అయినా అయన 20 వ శతాబ్దం లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన దర్శకుడిగా పేరు గడించాడు.రచయితల కుటుంబంలో పుట్టడం వలన సత్యజిత్ కి మొదటి నుంచి సినిమా పై ఆసక్తి తో పాటు మంచి పట్టు కూడా వుంది.

అలాంటి ఒక దర్శకుడు మళ్లి పుట్టడు.ఇప్పుడు రాజమౌళి చేస్తున్న పబ్లిసిటీ జిమ్మిక్కులు చూస్తున్నాం కానీ సత్యజిత్ సైతం సినిమా కథ నుంచి మొదలు పెట్టి స్క్రీన్ ప్లే, సంగీతం తో పాటు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ని అన్ని తానే భుజాన వేసుకొని చూసుకునేవాడు.ఇప్పుడు మనం చూస్తున్న చాల మంది దర్శకులకు ఆయనే స్ఫూర్తి.సినిమా ఎలా తీయాలో అయన దగ్గర నేర్చుకొని ఎంతో మంది దర్శకత్వం చేసారు.ఇక సత్యజిత్ రాయ్ కొడుకు కూడా ఇండస్ట్రీ కి చెందిన వ్యక్తి కావడం విశేషం.







