ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు పవిత్ర లోకేష్.( Pavitra Lokesh ) సినిమాలతో కంటే వ్యక్తిగత వ్యవహారాలతో టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారారు .
గత కొన్ని దశాబ్దాలుగా పలు భాషల్లో నటించి మెప్పించిన ఈ సీనియర్ భామ .ముచ్చటగా మూడో పెళ్లితో . టాలీవుడ్ ఆడియెన్స్ లో అటెన్షన్ రేకెత్తించింది .అంతగా అందరి చూపు తన వైపు తిప్పుకున్న పవిత్ర లోకేష్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.
పవిత్ర లోకేష్ కర్ణాటకలోని మైసూర్‌లో జన్మించారు.ఆమె తండ్రి లోకేష్ కూడా ఒక నటుడు .ఆమె తల్లి ఉపాధ్యాయురాలు.పవిత్రకు ఆది లోకేష్( Adi Lokesh ) అనే తమ్ముడు కూడా ఉన్నాడు.
పవిత్ర లోకేష్ చిన్నప్పటి నుంచి చదువులోనూ యాక్టివ్ గా ఉండేది .ఆమె తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడే తండ్రి చనిపోయాడు.అయినా కూడా చదువులో మెరుగ్గానే రాణించింది .పదవ తరగతి పరీక్షలో 80 శాతం సాధించి విద్య పట్ల తన మక్కువ చాటుకుంది…
![Telugu Naresh, Actresspavitra, Pavithra Lokesh, Pavitra Lokesh, Pavitralokesh-Mo Telugu Naresh, Actresspavitra, Pavithra Lokesh, Pavitra Lokesh, Pavitralokesh-Mo](https://telugustop.com/wp-content/uploads/2023/04/interesting-facts-about-actress-pavitra-lokesh-detailsa.jpg)
చదువులో విశేషంగా రాణించే పవిత్ర సివిల్ సర్వెంట్ కావాలని భావించింది .అయితే తండ్రి మరణంతో .ఆమె తన తల్లికి సహాయం చేయాలని నిర్ణయించుకొని .కుటుంబ బాధ్యతల భారం మోయడానికి ముందుకు వచ్చింది .తండ్రి కూడా నటుడే అయినప్పటికీ .మొదట్లో తన తండ్రి అడుగుజాడలను నడవడానికి ఇష్టపడని పవిత్ర మైసూర్‌లోని మహాజన ఫస్ట్ గ్రేడ్ కాలేజీ నుండి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి.సివిల్ సర్వీసెస్( Civil Services ) పరీక్షకు హాజరయింది.
అయితే తన మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించలేకపోయింది .ఆ తర్వాత బెంగుళూరుకు వెళ్లి నటనా జీవితాన్ని ప్రారంభించింది .ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్ సలహా మేరకు 1994లో నటిగా కెరీర్ మొదలు పెట్టింది…
![Telugu Naresh, Actresspavitra, Pavithra Lokesh, Pavitra Lokesh, Pavitralokesh-Mo Telugu Naresh, Actresspavitra, Pavithra Lokesh, Pavitra Lokesh, Pavitralokesh-Mo](https://telugustop.com/wp-content/uploads/2023/04/interesting-facts-about-actress-pavitra-lokesh-detailsd.jpg)
మిస్టర్ అభిషేక్ చిత్రం ద్వారా ఆమె నటిగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయింది…అయితే మొదట హీరోయిన్ గా చేసిన పవిత్ర సినిమాలు పెద్దగా ఆడలేదు దాంతో ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి తెలుగు లో చాలా సినిమాల్లో హీరోలకి మదర్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది…రేసుగుర్రం,మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు,టెంపర్ లాంటి సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేసి నటి గా మంచి గుర్తింపు తెచ్చుకుంది…అయితే ఇప్పుడు మాత్రం నరేష్ తో( Actor Naresh ) రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది…