అక్కినేని అఖిల్ ( Akhil Akkineni ) కెరీర్ స్టార్ట్ చేసి ఎన్నో రోజులు అవుతున్న ఈయన కెరీర్ లో చేసిన సినిమాలు నాలుగే.కానీ ఈ నాలుగు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యిన ఒక్క సినిమా కూడా లేదు.
బ్యాచిలర్ సినిమాతో పర్వాలేదు అనిపించుకుని పరువు నిలుపు కున్నాడు.ఇక అఖిల్ ఇప్పటి వరకు తన కెరీర్ లో చేసిన సినిమాలన్నీ లవ్ స్టోరీలుగానే తెరకెక్కాయి.
అయితే ఇప్పుడు అఖిల్ మాస్ యాక్షన్ డ్రామాకు ఓకే చెప్పాడు.
ఈయన కెరీర్ లో 5వ సినిమాగా వస్తున్న మూవీ ”ఏజెంట్” ( Agent ).ఈ సినిమా కోసం భారీ మేకోవర్ కూడా అయ్యాడు.రా ఏజెంట్ గా కనిపించడం కోసం తన లుక్ ను పూర్తిగా మార్చుకుని బీస్ట్ మూడ్ లోకి వచేసాడు.
మరి అఖిల్ ను మాస్ హీరోగా ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో మరో వారం రోజుల్లో తేలిపోనుంది.సురేందర్ రెడ్డి ( Surender Reddy ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

ఈ సినిమాను సురేందర్ 2 సినిమాస్( Surender 2 Movies ) తో కలిసి ఏకే ఎంటెర్టాన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.ఈయనకు జోడీగా సాక్షి వైద్య ( Sakshi Vaidya )హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమా కోసం అఖిల్ గత రెండేళ్లుగా టైం కేటాయించి మరొక సినిమా చేయకుండా ఉన్నాడు.మరి ఈ సినిమా మరో వారంలో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో నెక్స్ట్ ఎవరితో చేయాలి అనేది ఇంకా ఫిక్స్ కాలేదు.

కానీ తాజా సమాచారం ప్రకారం.పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు అఖిల్ తో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాయట.ముందుగా ఈ లిస్టులో యూవీ క్రియేషన్స్ ( UV Creations ) వారు ఉన్నారట.ఇప్పటికే వీరు అఖిల్ ను లాక్ చేసుకున్నట్టు తెలుస్తుంది.మరి యూవీ క్రియేషన్స్ అంటే స్టార్ డైరెక్టర్ తో అఖిల్ నెక్స్ట్ మూవీ ఉండబోతుంది అని తెలుస్తుంది.చూడాలి నెక్స్ట్ ఎవరితో చేస్తాడో.







