ప్రకాశం జిల్లా అక్కపాలెం చెంచుగూడెంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.గ్రామానికి సమీప అటవీ ప్రాంతంలో ఓ పులిని కొందరు చంపి తిన్నారన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.దీంతో అటవీ శాఖ అధికారులపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనంతరం ఫారెస్ట్ అధికారుల వాహనాన్ని అడ్డుకున్నారు.ఈ నేపథ్యంలో గ్రామస్థులకు, అధికారులకు మధ్య వాగ్వివాదం చెలరేగడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
అయితే నిజంగానే పులిని చంపి తిన్నారా.? అసలు అధికారులకు సమాచారం ఎవరు ఇచ్చారనే అంశంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.