దోమ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లు అనిపించగానే మీరు దానిని ఒక సెకనులో చంపేస్తారు.మరేదైనా కీటకం మీకు సమస్యగా మారితే దానిని యంత్రాల ద్వారా చంపేస్తారు.
లేదా వాటిని నాశనం చేయడానికి ఈ రోజుల్లో లభిస్తున్న అనేక యంత్రాల సాయం తీసుకుంటారు.అయితే వాటిని చంపుతున్నప్పుడు వాటికి నొప్పి కలుగుతుందా లేదా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరైనా మిమ్మల్ని కొట్టినప్పుడు, మీకు నొప్పి వచ్చినట్లే, దోమ, ఈగ లేదా ఇతర కీటకాల విషయంలో కూడా అదే జరుగుతుందనుకుంటారు.కానీ కీటకాలు నొప్పిని అనుభవించవని, వాటి శరీరం మానవులకు భిన్నంగా ఉంటుందని గతంలో పరిశోధకులు తెలిపారు.ఇటీవల వచ్చిన ఒక నివేదికలోనూ కొన్ని కీటకాలు నొప్పి అనుభూతి చెందవని పేర్కొన్నారు.
మరికొన్ని కీటకాలు నొప్పిని అనుభవిస్తాయని తెలిపారు.
నొప్పి సమయంలో సాధారణ మానవులు ఎలా స్పందిస్తారో అవికూడా అదే విధంగా స్పందిస్తాయట.
ఇంకా ఈ పరిశోధనలో ఏ విషయాలు బయటపడ్డాయో ఇప్పుడు తెలుసుకుందాం.ఇది నిజంగా బాధిస్తుందా? ఇంతకు ముందు కీటకాలకు నొప్పి తెలియదని నమ్మారు.కానీ ఇప్పుడు కొన్ని పరిశోధనలలో దీనికి వ్యతిరేక సమాచారం తెరపైకి వచ్చింది.మటిల్డా గిబ్బన్స్, లార్స్ చిట్కా, క్వీన్ మేరీ యూనివర్శిటీ ఆఫ్ లండన్, ఆండ్రూ క్రంప్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ చేసిన పరిశోధనలలో పలు విషయాలు వెల్లడయ్యాయి.300కి పైగా కీటకాలపై జరిపిన పరిశోధనలో అవి చాలా బాధను అనుభవిస్తున్నాయని తేలింది.

అయితే ఇది కొన్ని కీటకాలతో జరగదని కూడా తెలియవచ్చింది.విశేషమేమిటంటే కీటకాలకు నొప్పి కలిగినప్పుడు అవి అవి మనుషుల్లానే స్పందిస్తాయి.పలు పరిశోధనల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఏదైనా కీటకం నొప్పికి గురైనప్పుడు ఏదోఒక విధంగా స్పందిస్తుంది.అవి కష్టాల్లో పడినప్పుడు మెదడు ఆ నొప్పిని పసిగట్టినప్పుడు సాధారణంగా మానవుల మాదిరిగా ప్రతిచర్యను కలిగి ఉండాల్సిన అవసరం లేదని పరిశోధన వెల్లడించింది.
యూకే ప్రభుత్వం.ఆక్టోపస్, స్క్విడ్ వంటి పీతలు, ఎండ్రకాయలు, రొయ్యలను యానిమల్ వెల్ఫేర్ (సెన్సిబిలిటీ) యాక్ట్ 2022లో చేర్చినందున, కీటకాలు నొప్పిని అనుభవిస్తున్నాయనే వాస్తవం నిజం కావచ్చని తెలుస్తోంది.