కర్రలో కలిసి పోయిన కీటకం.. వీడియో వైరల్

ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో జీవులు ఉన్నాయి.వాటి గురించి చాలా మందికి తెలియక పోవచ్చు.అయితే సోషల్ మీడియాలో ఎన్నో ఆశ్చర్యకర వీడియోలు కనిపిస్తున్నాయి.అలాంటి వీడియోలు చూసినప్పుడు నెటిజన్లు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు.ఇక సృష్టిలో తెలివి అనేది కేవలం మనుషులకు మాత్రమే పరిమితం కాదు.ప్రతి జీవి బ్రతకడానికి, ఆహారం సంపాదించుకోవడానికి, గూళ్లు కట్టుకోవడానికి, ఇతర జీవుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి సొంతంగానే వాటి తెలివి వాటికి ఉంటుంది.

 Insect Camouflage Like Stick Video Viral On Social Media Details, Viral Latest,-TeluguStop.com

ఇలాంటి కోవకు చెందిన ఓ జీవి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అందులోని కీటకాన్ని చూస్తే అంతా ఆశ్చర్యపోతారు.కర్రలో కలిసిపోయి, తనకు ఏ ఆపదా రాకుండా తనను తాను అది కాపాడుకుంటుంది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కశ్వాన్ తరచూ ఎన్నో ఆసక్తికర వీడియోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తుంటారు.తాజాగా ఆయన ఓ వీడియోను పోస్ట్ చేశారు.

అందులో అడవి ప్రాంతంలో ఓ చెట్టుకు వేలాడుతూ ఓ కర్ర ఉంటుంది.

ఆసక్తితో ఆ కర్రను పరిశీలించగా ఏదో తేడాగా అనిపిస్తుంది.ఆ కర్రను కాసేపు కదిపి చూడగా ఓ కీటకం (పురుగు) కదులుతుంది.ఆ కర్రపై పాకుకుంటూ ముందుకు పోతుంది.

దీనిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.దానిని బాగా పరిశీలించి చూసినా అది పురుగు అని మనకు అర్ధం కాదు.

అంతలా ఆ కర్రలో అది కలిసి పోయింది.ఎవరైనా దానిని కదిపినా అది పురుగు అని ఎవరికీ అర్ధం కాదు.

కర్రలో మమేకం అయిపోయింది.ఈ వీడియోను ఇప్పటివరకు 4 లక్షలకు పైగా నెటిజన్లు వీక్షించారు.

వింతగా కనిపించే ఈ కీటకాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు.తనను తాను కాపాడుకుంటున్న తీరును చూసి, దాని తెలివికి మంత్ర ముగ్ధులయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube