వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంపై దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఇందులో భాగంగా ప్రజా ధనాన్ని వినియోగించి, ప్రభుత్వ ఉద్యోగులతో వై ఏపీ నీడ్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి కార్యక్రమంలో పాల్గొనేలా చేస్తున్నారని పేర్కొన్నారు.
అయితే కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం కేడర్ రూల్స్ కు విరుద్ధమని పిటిషనర్ తరపు లాయర్లు తెలిపారు.ఈ క్రమంలోనే ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.