సుప్రీంకోర్టులో ఈసీ నియామకంపై విచారణ

భారత అత్యున్నత న్యాయస్థానంలో ఇవాళ ఈసీ నియామకంపై విచారణ జరగనుంది.ఈసీగా అరుణ్ గోయల్ నియామకంపై కేంద్ర ప్రభుత్వం ఫైల్ సబ్మిట్ చేయబోతోంది.

ఎన్నికల కమిషనర్ నియామకంపై కొలిజీయం వ్యవస్థ ఏర్పాటు చేయాలని పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.ఈ పిల్ పై విచారణ జరుగుతుండగానే ఈసీ నియామకంపై సుప్రీంకోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది.

ఈసీ నియామకంలో పాటించే మార్గదర్శకాలను తెలపాలని సూచించింది.ఈ మేరకు నియామకం చట్టబద్ధమైతే భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

కాగా ఎన్నికల కమిషనర్ల ఎంపికపై సుప్రీం ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది.ఎన్నికల వ్యవస్థ ప్రమాదంలో ఉందని తెలిపింది.

Advertisement

ఈ క్రమంలో ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు రావాలని న్యాయస్థానం పేర్కొంది.అదేవిధంగా సీఈసీ ఎంపిక ప్రక్రియను మార్చాలని వెల్లడించింది.

కొలీజియం లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

Advertisement

తాజా వార్తలు