ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై టీఎస్ హైకోర్టులో విచారణ

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు చేస్తుంది.

అయితే సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం సీబీఐ విచారణకు నిరాకరించింది.

సిట్ దర్యాప్తునే కొనసాగించాలని ఆదేశాలిచ్చింది.దర్యాప్తు పారదర్శకంగా జరిగేలా చూడాలని సూచించింది.

ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.అదేవిధంగా దర్యాప్తు పురోగతి నివేదికను ఈనెల 19న సింగిల్ జడ్జికి సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
ఇది కదా అసలైన పెళ్లిరోజు గిఫ్ట్.. వైరల్ వీడియో

తాజా వార్తలు