ఈ జైలు మాకొద్దు...న్యూయార్క్ ఖైదీల నిరసన

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గల బ్రూక్లిన్‌ జైలు ఖైదీలు ఆది వారం నిరసనలు తెలిపారు.ఈ జైలులో ఉండలేము అంటూ ఫ్లకార్డులు పట్టుకున్నారు.

వారికి మద్దతుగా జైలు బయట వారి వారి కుటుంభ సభ్యులు సైతం ఫ్లకార్డులతో నిరసనలు వ్యక్తం చేశారు.అందుకు గల కారణాలు ఏమిటా అనే వివరాలలోకి వెళ్తే.

జైలులో సరైన సదుపాయాలూ లేవని , తాము జైలులో నరకం అనుభవిస్తున్నామని , అంతేకాదు కరెంట్ సదుపాయం కూడా ఈ జైలులో లేదని జైలులో విపరీతమైన వేడి ఉందంటూ అందరూ భారీ ఎత్తున నిరసనలు తెలిపారు.అధిక వేడి కారణంగా తాము ఎంతో ఇబ్బంది పడుతున్నామని నినదించారు.

ఈ విషయంలో జైళ్ల శాఖ అధికారులు తక్షణమే స్పందిచాలని వారు డిమాండ్ చేశారు.ఉన్నత అధికారులు మాకు తగిన న్యాయం చేయాలని వారు కోరారు.అయితే యూఎస్‌ హౌస్‌ మెంబర్‌ జోరో ల్డ్‌ నాద్లెర్‌ ఖైదీలు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి మద్దతు తెలిపారు.

Advertisement

ప్రభుత్వం వారి కనీస అవసరాలు తీర్చాలని ఆయన ప్రభుత్వాని కోరారు.

బెడ్‌రూమ్‌లో రాక్షసి ఉందనుకున్న చిన్నారి.. తీరా వెతికితే ఊహించని షాక్..?
Advertisement

తాజా వార్తలు