కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు తథ్యం ! ప్లానంతా సిద్ధం ?

త్వరలో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కొత్త జాతీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారని గత కొంతకాలంగా హడావుడి జరుగుతున్న సంగతి తెలిసిందే.టిఆర్ఎస్ ను జాతీయ పార్టీలో విలీనం చేసి భారత్ రైతు సమితి పేరుతో కొత్త జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

 Information About The Formation Of Kcr's National Party! Is The Plan Read Kcr, T-TeluguStop.com

దీనికి తగ్గట్లుగానే సీఎం కేసీఆర్ కూడా దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ,  వివిధ ప్రాంతీయ పార్టీల అధినేతలను కలుస్తూ బిజెపిపై విమర్శలతో విడుచుకుపడుతున్నారు.అయితే జాతీయ స్థాయిలో కేసీఆర్ వెంట నడిచేందుకు చాలా ప్రాంతీయ పార్టీలు వెనుకడుగు వేస్తున్న క్రమంలో,  కొత్త జాతీయ పార్టీని ప్రకటించే అవకాశం లేదని అంత భావించారు.

కానీ కెసిఆర్ మాత్రం కొత్త పార్టీ ఏర్పాటు దిశగానే అడుగులు వేస్తున్నారు.
         ఈ మేరకు పార్టీ నాయకులతో కీలక సమావేశాన్ని ఈనెల 5వ తేదీన ఏర్పాటు చేశారు.అలాగే మధ్యాహ్నం 1.19 గంటలకు కొత్త జాతీయ పార్టీని కేసిఆర్ స్వయంగా ప్రకటించబోతున్నారు.అంతకుముందే 11 గంటలకు తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.దీనికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు,  జిల్లా పరిషత్ చైర్మన్ లు,  పార్టీ రాష్ట్ర కార్యవర్గం మొత్తం 283 మంది ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు.

జాతీయ పార్టీ ప్రకటనకు ముందుగానే పార్టీ పేరును టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చుతూ విస్తృత సమావేశం తీర్మానం చేయనుంది.ఆ తర్వాత 5వ తేదీన 1.19 నిమిషాలకు జాతీయ పార్టీని ప్రకటిస్తారు.
   

       టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం ద్వారా , పార్టీ జెండా ఎన్నికల గుర్తు వంటివాటికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని కేసీఆర్ భావిస్తున్నారు.ఈ క్రమంలోనే పగడ్బందీగా సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.డిసెంబర్ 9వ తేదీన ఢిల్లీలో భారీ బహిరంగ సభను నిర్వహించి ఆ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల్లోని కీలకమైన రాజకీయ పార్టీల అధినేతలను ఆహ్వానించి బిజెపికి వ్యతిరేకంగా వారి మద్దతు కూడగట్టేందుకు కేసిఆర్ ఒక నిర్దిష్టమైన ప్రణాళికను సిద్ధం చేసుకున్నారట.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube