ఒకప్పుడు చిరంజీవి( Chiranjeevi ) స్టార్ హీరోగా వెలుగొందుతున్న సమయంలో కొన్ని పరాజయాలు కూడా ఎదురయ్యాయి.కానీ వాటిని అధిగమిస్తూ ఎప్పటికప్పుడు తన వ్యూహాలను మార్చుకుంటూ ఎలాంటి సినిమాలు ప్రేక్షకులు నచ్చుతాయని ప్రేక్షకుల యొక్క అభిరుచులను తెలుసుకొని మరి సినిమాలను చేసి సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకొని మెగాస్టార్ గా తన ప్రస్థానాన్ని ఇప్పటివరకు కొనసాగిస్తూ వచ్చాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు తన తమ్ముడైన నాగబాబుని( Naga Babu ) సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశాడు.అయితే నాగబాబు ఒకటి రెండు సినిమాల్లో హీరోగా చేసినప్పటికీ ఆయన హీరో మెటీరియల్ కాదని చాలామంది తేల్చేశారు.

చిరంజీవి ఎన్నో అంచనాలను పెట్టుకొని నాగబాబు ను హీరోగా లాంచ్ చేస్తే మాత్రం ఆయన పెద్దగా సక్సెస్ అవ్వకపోవడంతో చిరంజీవిని చాలామంది విమర్శిస్తూ మాట్లాడారు.అన్నయ్య మెగాస్టార్ అయినంత మాత్రాన తమ్ముడిని కూడా జనాల మీదకి రుద్దుతామంటే ఎలా ఆయనకు కూడా టాలెంట్ ఉండాలి కదా అంటూ చిరంజీవిని చాలా మంది హేళన చేస్తూనే నాగబాబు మీద విమర్శలు చేశారు.ఇక అదే కసితో చిరంజీవి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ను సినిమాల్లోకి తీసుకువచ్చి ఎలాగైనా సక్సెస్ చేయాలనే టార్గెట్ ని పెట్టుకొని మరి పవన్ కళ్యాణ్ ను పవర్ స్టార్ గా తీర్చిదిద్దారు.

ఇక మొత్తానికైతే చిరంజీవి ఒక తమ్ముడి విషయంలో ఫెయిల్ అయినప్పటికీ మరొక తమ్ముడి విషయంలో మాత్రం ఆయన సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.ఇక ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా చేస్తున్నాడు.అలాగే పవన్ కళ్యాణ్ కూడా వరుస సినిమాలు చేస్తూ అటు పాలిటిక్స్ లో కూడా కీలకపాత్ర వహిస్తూ వస్తున్నాడు.
నాగబాబు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నాడు…ఇక మొత్తానికైతే ఇండస్ట్రీ లో గ్రాండ్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి
.