తెలుగు చిత్ర పరిశ్రమకు ఓటు రాజకీయం అవసరం లేదని నిర్మాత దిల్ రాజు అన్నారు.నాలుగు సెక్టార్ లలో సమస్యలు ఉన్నాయని తెలిపారు.
అదేవిధంగా ఆ సమస్యల పరిష్కారం కోసం తమ దగ్గర ప్రణాళికలు కూడా ఉన్నాయన్నారు.తమ ప్యానల్ లో యాక్టివ్ మరియు అనుభవజ్ఞులైన సభ్యులు ఉన్నారని చెప్పారు.
పెండింగ్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు.ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ ముందుకు వెళ్లడానికి ఎవరు కరెక్టో ఆలోచించి ఓటు వేయాలని దిల్ రాజు సూచించారు.







