‘‘స్వస్తిక్’’కు ‘‘హకెన్‌ క్రూజ్’’కు తేడా తెలుసుకోండి: ‘Reclaim Swastika’ క్యాంపెయిన్ ప్రారంభించిన ఇండో కెనడియన్లు

హిందువులు పరమ పవిత్రంగా భావించే స్వస్తిక్ గుర్తుకు.నాజీల ద్వేషానికి చిహ్నమైన ‘హకెన్ క్రూజ్’లు ఒకటే అన్నట్లుగా కొన్ని దేశాల్లో ప్రచారం జరుగుతూ వుండటంపై హిందూ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

 Indo Canadian Community Group Launches Reclaim Swastika Campaign-TeluguStop.com

ముఖ్యంగా భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన కెనడాలో ఈ పరిస్ధితి పలు సమస్యలకు దారి తీస్తోంది.అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన తీవ్రవాద దాడుల తర్వాత కెనడా( Canada )లో సెమిటిక్ వ్యతిరేక ఘటనలు చోటు చేసుకోవడంతో అక్కడి అధికారులు నాజీ స్వస్తిక చిహ్నాన్ని ఉపయోగించడాన్ని వ్యతిరేకించారు.

ఈ నేపథ్యంలో స్విస్తిక్ చిహ్నాం, నాజీల హెకెన్ క్రూజ్‌లు ఒకటి కాదని చెప్పేందుకు గాను ఇండో కెనడియన్ కమ్యూనిటీ “Reclaim Swastika” ప్రచారాన్ని ప్రారంభించింది.

Telugu Cohhe, Hindus, Indocanadian, Justin Trudeau, Swastika, Toronto-Telugu NRI

యూదుల ప్రార్ధనా మందిరాలు, పాఠశాలలు, కమ్యూనిటీ సెంటర్లు , వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుంటున్న కొందరు ఆయా ప్రదేశాల్లో నాజీ చిహ్నాలను వుంచుతున్నారు.నవంబర్ 5న ఒట్టావాలో జరిగిన ఒక నిరసన ర్యాలీలో ఆ చిహ్నం ప్రదర్శించారు.దీనిపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) స్పందించారు.

పార్లమెంట్ హిల్స్‌పై స్వస్తిక ప్రదర్శన ఆమోదయోగ్యం కాదంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.టొరంటో పోలీస్ సర్వీసెస్ వెబ్‌సైట్( Toronto Police Service ) సైతం స్వస్తికను ‘‘ద్వేషపూరిత చిహ్నం’’గా అభివర్ణించింది.

దీనిని ఉపయోగించడాన్ని శిక్షార్హమైన నేరంగా పౌర సమాజాన్ని హెచ్చరించింది.

Telugu Cohhe, Hindus, Indocanadian, Justin Trudeau, Swastika, Toronto-Telugu NRI

ఇది ఇండో కెనడియన్ కమ్యూనిటీలో ఆందోళనకు దారి తీసింది.కెనడియన్ ఆర్గనైజేషన్ ఫర్ హిందూ హెరిటేజ్ ఎడ్యుకేషన్ ( CoHHE ) స్పందిస్తూ.తక్షణం ‘‘రీక్లెయిమ్ స్వస్తిక’’ ప్రచారాన్ని ప్రారంభించింది.

టొరంటో పోలీసులకు, ఇతర లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు రాసిన లేఖలో .సంస్కృతంలో స్వస్తిక అంటే ‘‘ అందరికీ శుభం, శ్రేయస్సు’’ అనే అర్ధమని పేర్కొంది.స్వస్తిక చిహ్నం చాలా పవిత్రమైనదని, దేవాలయాలు, గృహాలు, వ్యాపార సముదాయాలలో విస్తృతంగా ఉపయోగిస్తామని వెల్లడించింది.స్వస్తిక అనేది ద్వేషపూరిత చిహ్నం కాదని.ఇది హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు ఉపయోగించే పురాతన, పవిత్రమైన చిహ్నమని స్పష్టం చేసింది.నాజీలు ఎన్నడూ స్వస్తికను ఉపయోగించలేదని.

వారు కట్టిపడేసినట్లుగా, వంపులు తిరిగినట్లుగా వుండే క్రాస్ లేదా హకెన్ క్రూజ్‌ని ఉపయోగించారని సంస్థ పేర్కొంది.నాజీ చిహ్నంతో స్వస్తిక తప్పుగా జోడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube