చైనా( China ) వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేటలో తన జోరు కొనసాగిస్తోంది.ఇప్పటివరకు ఈ మెగా టోర్నమెంట్లో భారత్ 13 స్వర్ణాలు, 21 వెండి, 21 కాంస్య పతకాలు గెలిచింది.
ఆదివారం ఒక్క రోజే భారత్ ఏకంగా 15 మెడల్స్ గెలిచి తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించింది.అథ్లెటిక్స్ లో తొమ్మిది పతకాలు, షూటింగ్ లో మూడు పతకాలు, బ్యాట్మింటన్ లో ఒక పతకం, గోల్ఫ్ లో ఒక పతకం, బాక్సింగ్ లో ఒక పతకం సాధించింది.
భారత పురుషులతో పాటు స్కేటింగ్ రిలే టీమ్( Skating relay team ) కాంస్య పతకం సాధించింది. ఉమెన్స్ స్పీడ్ స్కేటింగ్ 3000మీ.లో భారత ప్లేయర్లు కార్తిక జగదీశ్వరన్, హీరాల్ సాధూ, ఆరతి కస్తూరి( Jagadeeswaran, Heeral Sadhu, Aarti Kasturi ) బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నారు.ఈ ఆటగాళ్లు సమిష్టిగా రాణించి 4:34.861 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకొని బ్రాంజ్ మెడల్ ను సాధించారు.ఇక అబ్బాయిల విషయానికి వస్తే.
రోలర్ స్కేటింగ్ లో కూడా భారత ఆటగాళ్లు తమ సత్తా నిరూపించుకొని అదరగొట్టారు.మెన్స్ స్పీడ్ స్కేటింగ్ 3000మీ.
రిలే టీమ్ ఈవెంట్లో కాంస్య పతకం కైవసం చేసుకున్నారు.భారత జట్టు ఆటగాళ్లయిన ఆర్యన్ పాల్, ఆనంద్ కుమార్, సిద్ధాంత్, విక్రమ్ భారత్ కు పతకం అందించారు.
ఈ ఆసియా క్రీడలు సెప్టెంబర్ 23వ తేదీ ప్రారంభమయ్యాయి.మొదటినుండి భారత్ వివిధ క్రీడలలో పతకాలను సాధిస్తూ తన జోరు కొనసాగిస్తోంది.అక్టోబర్ 8వ తేదీ వరకు ఈ ఆసియా క్రీడలు( Asian Games ) జరుగనున్నాయి.భారత్ ఇంకొన్ని పతకాలు తన ఖాతాలో వేసుకుంటుందో చూడాల్సి ఉంది.
పురుషులకు ఏమాత్రం తగ్గకుండా మహిళలు కూడా భారత్ కు ఎన్నో పతాకాలు సాధించి పెడుతున్నారు.