ఫైర్ పానీపూరీని ఎపుడైనా తిన్నారా? ఇలాగే తినేయాలి జాగ్రత్త!

ఇక్కడ పానీపూరీ( Panipuri ) గురించి చెబితే చాలా కామెడీగా ఉంటుంది.ఎందుకంటే పానీపూరి అంటే ఏమిటో తెలియనివారు దాదాపుగా ఇక్కడ వుండరు.

 India's First Fire Golgappa Viral News,fire Pani Puri, Pani Puri News, Viral New-TeluguStop.com

చాలా మందికి ఇది ఫేవరేట్ స్నాక్ ఐటమ్.చల్లటి సాయంత్రం వేళ.స్పైసీ పానీపూరీ తినాలని ఏవరు కోరుకోరు.ముఖ్యంగా అమ్మాయిల గురించి ఇక్కడ చెప్పుకోవాలి.

పానీపూరీ అంటే ఇక్కడ పడిచచ్చే ఆడవాళ్లు వున్నారంటే నమ్మశక్యం కాదు.కానీ నిజం.

రోజుకి ఒక్క ప్లేట్ పానీపూరి తిననిదే వారికి నిద్ర పట్టదు.చాలా క్రేజీగా మన ఆడోల్లు వాటిని ఆరగిస్తారు.

మీరు ఇంత వరకు సాధారణ పానీపూరీనే ఎరిగి వుంటారు.అయితే మీలో ఎవరైనా ఫైర్ పానీపూరీ( Fire Panipuri )ని ఎపుడైనా తిన్నారా? తినివుండరు కదూ.దానిని తినాలంటే బీహార్‌ వెళ్లాల్సిందే.అక్కడ ముజఫర్‌పూర్‌లో ఈ ఫైర్ పానీపూరీ ట్రెండింగ్‌లో ఉందిపుడు.

బైరియా చౌక్ నుంచి పహార్‌పూర్‌కు వెళ్లే రహదారిలో స్టేట్ బ్యాంక్ ముందు ప్రతి సాయంత్రం ఫైర్ పానీ పూరీ బండి అందుబాటులో ఉంటుంది.పింటూ కుమార్ అనే యువకుడు ఈ ఫైర్‌ పానీపూరీ బండిని చాలా సక్సెస్ ఫుల్ గా నడుపుతున్నాడు.

దీని తయారీ కూడా సాధారణ పానీపూరీలాగానే ఉంటుంది.

దాదాపు పది పదిహేను పదార్థాలను పూరిలో వేసిన తరువాత దానిపై తినే కర్పూరం ఉంచి, వెలిగిస్తారు.అది మండుతండగానే నోట్లో పెట్టేస్తారు.ఏంటి భయంగా వుందా? దీనిని తినడానికి అక్కడి స్థానికులు ఎగబడుతున్నారండి బాబు.ఫైర్ పానీపూరీ టేస్ట్ చాలా బాగుందని.నోట్లో వేసుకున్నా కాలలేదని కస్టమర్లు చాలామంది చెబుతున్నారు.ఇలాంటి పానీపూరీ ముజఫర్ వాసులకు కొత్త అని.రోజురోజుకూ దీనికి క్రేజ్ పెరుగుతోందని అంటున్నారు.మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube