కెనడాలో ఇండియన్స్ దే పైచేయి...ఏకంగా లక్ష మంది...

ప్రపంచం నలుమూలల్లో ఎక్కడికి వెళ్ళినా సరే భారతీయుడి మూలాలు లేకుండా ఉండవు.ఆయా దేశాలలో భారతీయులు అన్ని రంగాల్లో మనదైన ప్రతిభ కనబరుస్తూనే ఉంటారు.

 Indians Have The Upper Hand In Canada One Hundred Thousand People , Canada, Indi-TeluguStop.com

రంగం ఏదైనా, సవాళ్లు ఎలాంటివైన సరే వాటితో పోటీ పడగలిగే సత్తా మన భారతీయులకు ఉందనడంలో సందేహం లేదు.ఈ విషయంలో భారతీయుడి సాటి ఇంకొకరు ఉండరని చెప్పడానికి ఏ మాత్రం సంకొంచినవసరం లేదు.

ఏ దేశం వెళ్ళినా సరే మనదే పై చేయి అవ్వాలనే దృడ సంకల్పం మనవారిలో స్పష్టంగా కనిపిస్తుంటుంది.భారతీయులు వేరే దేశానికి వలసలు వెళ్తున్నారంటే, పై చదువుల కోసమో, ఉన్నత ఉద్యోగాల కోసమో విదేశాలలో స్థిరపడాలన్న ఉద్దేశ్యంతోనో అయి ఉండచ్చు.

అయితే సాధారణ వలస దారుగా వెళ్లి అక్కడ సుస్థిర నివాసం ఏర్పరుచుకోవటం మాత్రం అంత సులువైన పని కాదు.కారణమేదైన అక్కడ మన వాళ్ళు కనబరిచే ప్రతిభకు ఆయా దేశాలు ఫిదా అయ్యి రెడ్ కార్పెట్ పరచక మానవు.

ఇంతకీ మన వారి ప్రతిభ గురించి ఎందుకు ఇప్పుడు చెప్పాల్సి వస్తోందంటే.

Telugu Alberta, Asia, Canada, Indian, Indiansupper, Labrador, Newfoundland, Onta

కెనడా 2021 సెన్సెస్ రిపోర్ట్ ప్రకారం ఆ దేశానికి వలస వచ్చిన వారిలో ఆసియా కు చెందినవారు 62 శాతం ఉండగా,అందులో భారతీయులు 18.6 శాతంగా మొదటి స్థానంలో ఉన్నారు.కెనడా దేశంలో ఏర్పడిన కార్మిక లోటు కారణంగా ఆ దేశం ప్రతీ ఏటా 5లక్షల వలసదారులకు ఆహ్వానం పలకాలని నిర్ణయించుకుంది.

అయితే, దానిలో భాగంగానే 2021 లో కెనడా 405000 మంది కొత్త వలస దారులకు అనుమతి ఇచ్చింది.ఈ క్రమంలో మునుపెన్నడూ లేని విధంగా ఒకే ఏడాదిలో లక్ష మంది భారతీయులకు శాశ్వత నివాస(పర్మినెంట్ రెసిడెన్స్) హోదాను పొందినట్లు ఆ దేశ గణాంకాల సంస్థ తెలిపింది.

ఇదిలాఉంటే 2016-2021 మధ్య కాలంలో కెనడాలో జరిగిన శ్రామిక శక్తి వృద్ధిలో 80 శాతం మంది ప్రవాసులే ఉండటం విశేషం.ఎక్కువగా అంటారియో, క్యుబెక్, న్యూఫౌండ్ల్యాండ్, సస్కట్చేవాన్, లబ్రడార్ లో ప్రవాసులు అధికంగా ఉపాది అవకాశాలు పొందుతున్నట్లు అక్కడి సర్వే తెలియజేసింది.

అదే విధంగా భారతీయులు అంటారియో, బ్రిటిష్ ప్రవేన్స్, అల్బెర్టా, క్యుబెక్ లో ఎక్కువగా నివాసం ఉంటున్నారని ఈ సర్వే వెల్లడించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube