అమెరికాలో స్థిరపడాలనే తలంపుతో రెండో పీజీ పేరుతో ఎంతో మంది భారతీయ విద్యార్ధులు రెండో పీజీ చేస్తున్నారని.వారు నిభందనలు ఉల్లంగిస్తున్నారని .
లాంటి వారికి తిప్పలు తప్పవని అంటున్నారు ఇమ్మిగ్రేషన్ అధికారులు.అలాంటి వారిని విడిచిపెట్ట బోమని స్పష్టం చేసారు.
ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా గాలింపు చేపడుతున్నారు.దాంతో చాలా మంది భారతీయ విద్యార్ధులకి ఇక్కట్లు తప్పవనే వార్తలు వినిపిస్తున్నాయి.
అమెరికాలో స్థిరపడాలనే లక్ష్యంతో భారతీయులు రెండో పీజీ మార్గాన్ని ఎంచుకున్నారని ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) అధికారులు అనుమానిస్తూ చర్యలకు తీవ్ర తరం చేస్తున్నారు.అయిదేళ్లకు పైబడి అమెరికాలో ఉంటున్న వారి వివరాలను ఆరా తీస్తున్నారు.
అంతేకాదు విద్యార్థులు ఉండే గదులు, ఇళ్ళకి నేరు గా వెళ్లి ప్రశ్నలు సంధిస్తున్నారు.న్యాయస్థానానికి హాజరు కావాలని కొందరికి నోటీసులు కూడా ఇస్తున్నారు.రెండో పీజీ చేస్తున్న భారతీయ విద్యార్థులు తమ దేశంలో ఎంత మంది ఉంటున్నారు అనే విషయంపై పోలీసులు పక్కా నిఘాని ఏర్పాటు చేసుకున్నారు.
తాజా వార్తలు