ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్ధులు అక్కడ దుండగుల చేతిలో దాడులకు గురవ్వడమో లేదంటే ప్రాణాలు కోల్పోవడమో జరుగుతోంది.తాజాగా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ భారతీయ విద్యార్ధి కత్తిపోట్లకు గురయ్యాడు.
బాధితుడిని శుభమ్ గార్గ్‌గా గుర్తించారు.ఇతను నగరంలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూసౌత్ వేల్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్నాడు.
అసలేం జరిగిందంటే.
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన శుభమ్ గార్గ్.ఐఐటీ మద్రాసులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.ఈ క్రమంలో ఉన్నత చదువుల కోసం ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన ఆయన ఆస్ట్రేలియాకు వెళ్లాడు.ఈ నేపథ్యంలో అక్టోబర్ 6వ తేదీ రాత్రి 10.30 గంటలకు రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న శుభమ్‌ను ఓ ఆగంతకుడు అడ్డగించాడు.డబ్బులు లేవని, లేదంటే చంపేస్తానని బెదిరించాడు.దీనికి శుభమ్ తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన దుండగుడు అతనిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయాడు.
ఈ ఘటనలో శుభమ్ ముఖం, ఛాతి, కడుపులో తీవ్ర గాయాలయ్యాయి.రక్తపు మడుగులో పడివున్న బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
రెండు రోజుల తర్వాత శుభమ్ తల్లిదండ్రులకు ఈ దాడి గురించి తెలియడంతో వారు తమ కుమారుడికి సాయం చేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.సిడ్నీలోని భారత దౌత్య కార్యాలయం, ఆస్ట్రేలియాలోని ఇండియన్ హై కమీషన్ శుభమ్‌కు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది.అతని తల్లిదండ్రులకు వీసా మంజూరవ్వగానే వారు ఆస్ట్రేలియాకు బయల్దేరి వెళ్లనున్నారు.ప్రస్తుతం శుభమ్ ఆరోగ్యం విషమంగానే వుందని అతని సోదరి చెప్పారు.వైద్యులు అతని ప్రాణాలను కాపాడేందుకు గాను పలు సర్జరీలు చేసినట్లుగా సమాచారం.