2022తో పోలిస్తే 2023లో కెనడియన్ ఉన్నత విద్యాసంస్ధల్లో ( Canadian Top Institutions ) చేరడానికి భారతీయ విద్యార్ధుల దరఖాస్తులు దాదాపు 15 శాతానికి పైగా తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి.దౌత్యపరమైన ఉద్రిక్తతలతో పాటు కెనడాలో గృహ సంక్షోభం నేపథ్యంలో విద్యార్ధుల సంఖ్య పడిపోయినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.ఇమ్మిగ్రేషన్ , రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా( Immigration, Refugees and Citizenship Canada ) డేటా ప్రకారం .2023కి స్టడీ పర్మిట్ అప్లికేషన్‌లు గతేడాది 3,63,484 వుండగా.అవి ఇప్పుడు 3,07,603కి పడిపోయాయి.2023 చివరి త్రైమాసికంలో తగ్గుదల గణనీయంగా వుంది.2022లో 1,19,923 నుంచి 42 శాతం తగ్గుదలతో 69,203కి ఈ దరఖాస్తులు పడిపోయాయి.దరఖాస్తుల సంఖ్య తగ్గినప్పటికీ.
భారత్ నుంచి అంతర్జాతీయ విద్యార్ధుల కోటాలో జారీ చేసిన అధ్యయన అనుమతులు పెరగడం ఆ దేశానికి ఊరట కలిగించే అంశం.గతేడాది 2,25,820 నుంచి ఇవి రికార్డ్ స్థాయిలో 2,78,860కి చేరుకున్నాయి.
2022లో జారీ చేయబడిన మొత్తం 5,48,720 మంది స్టడీ పర్మిట్ హోల్డర్లలో 41 శాతం మంది భారతీయ విద్యార్ధులే, 2023లో వీరు 6,84,385 మంది వున్నారు.ప్రస్తుతం కెనడాలో 3,00,00 మంది భారతీయ విద్యార్ధులు( Indian Students ) వున్నట్లు అక్కడి భారతీయ హైకమీషన్ అంచనా వేసింది.2023 ద్వితీయార్ధం నుంచి భారతీయ విద్యార్ధుల దరఖాస్తుల్లో తగ్గుదల ప్రారంభమైంది.కెనడాలో వసతి ఖర్చుల పెరుగుదలతో పాటు గతేడాది సెప్టెంబర్‌లో హౌస్ ఆఫ్ కామన్స్‌లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Canada PM Justin Trudeau ) భారత్‌పై చేసిన వ్యాఖ్యలు ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపింది.
మరోవైపు.కెనడియన్ ప్రభుత్వం( Canadian Government ) గతేడాది మిలియన్ దాటిన అంతర్జాతీయ విద్యార్ధుల ఆటుపోట్లను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోబోతున్నందున ఈ సంఖ్యలు 2024లో మరింత ప్రభావితం కావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇకపోతే.డిసెంబర్ 2023లో కెనడాలో శాశ్వత నివాసం కోసం భారతీయుల నుంచి వచ్చిన దరఖాస్తుల సంఖ్య 62 శాతం మేర పడిపోయింది.న్యూఢిల్లీ( New Delhi ) , ఒట్టావా మధ్య ద్వైపాక్షిక ఉద్రిక్తతల ప్రభావం ఇమ్మిగ్రేషన్ నమూనాలలో కనిపిస్తుంది.ఇమ్మిగ్రేషన్, శరణార్ధులు, పౌరసత్వ కెనడా (ఐఆర్‌సీసీ) నుంచి వచ్చిన డేటా ప్రకారం.2022 డిసెంబర్‌లో 16,796 మంది దరఖాస్తులు చేసుకోగా.2023లో అదే సమయం నాటికి ఇవి 6,329కి పడిపోయాయి.2023 చివరి త్రైమాసికంలో భారతీయుల దరఖాస్తులు 35,735 నుంచి 19,579కి పడిపోయాయి.