అమెరికాలో భారతీయుల పాట్లు...విద్యార్ధులకు ఇబ్బందే అయినా...ఉద్యోగులకు మాత్రం...!!

అగ్ర రాజ్యం అమెరికాలో పరిస్థితులు తారుమారవుతున్నాయి.డాలర్ విలువ మెల్ల మెల్లగా బలపడటంతో ఈ ప్రభావం అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్ధులకు ఆర్ధిక పరమైన సమస్యలను తెచ్చి పెడుతోంది.

 Indian Students Problems In America. Even If It's A Problem For Students But Fo-TeluguStop.com

ప్రస్తుత పరిస్థితులలో ఈ ప్రభావం పిల్లలను ఉన్నత చదువుల కోసం పంపుతున్న పిల్లల తల్లి తండ్రులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.అమెరికా చదువు అంటేనే హడలిపోయేలా చేస్తోంది.

ముఖ్యంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.ఈ ప్రభావం ఎవరికి ఎలా ఉన్నాసరే.

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళే వారికి మాత్రం తలకు మించిన భారంగా మారుతోంది.ముఖ్యంగా ప్రతీ ఏటా అత్యధికంగా అమెరికా వెళ్లి చదువుకునే ప్రవాస విద్యార్ధులలో భారతీయ విద్యార్ధులే అత్యధికంగా ఉన్నారు.

ఈ ఏడాది కూడా మన వారి హవానే కొనసాగింది.అయితే డాలర్ విలువ అమాంతం 80 ను తాకడంతో భారతీయ విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికే తల్లి తండ్రులు ఎంతో కష్టించి అప్పులు చేసి మరీ తమను ఉన్నత చదువుల కోసం పంపారని, ప్రస్తుత పరిస్థితులలో ఖర్చులు మరింత ఎక్కువ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.కాగా.

Telugu America, Dollar, Financial, Indian Nris, Indian, Jobs, Timr Jobs-Telugu N

అమెరికాలో మన విద్యార్ధుల పరిస్థితి ఇలా ఉంటే ఉద్యోగాలు చేస్తున్న భారతీయ ఎన్నారైలకు మాత్రం డాలర్ విలువ పెరగడం వరంగా మారింది.డబ్బును కూడ బెత్తడమే కాక గతంలో కంటే ఎక్కువగా డబ్బును భారత్ పంపుతున్నారట.అయితే ఈ మధ్య కాలంలో కొత్తగా ఉద్యోగాలలో చేరిన వారికి కాస్త ఇబ్బందులు ఎదురైనా పూర్తి ప్రభావం మాత్రం విద్యార్ధులపై పడుతోందట.దాంతో విద్యార్ధులు తప్పనిసరిగా పార్ట్ టైం జాబ్స్ చేసి తీరాల్సిన పరిస్థితులు ఎర్పడ్డాయని అంటున్నారు పరిశీలకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube