అమెరికా : వర్జీనియా డెమొక్రాటిక్ ప్రైమరీలో సుహాస్ సుబ్రహ్మణ్యం గెలుపు

అమెరికా రాజకీయాల్లో భారత సంతతి ప్రజలు దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే దేశంలో రెండో అత్యున్నత పదవిని దక్కించుకున్న చరిత్ర ఇండో అమెరికన్లది.

ఇక సెనేటర్లుగా, కాంగ్రెస్ సభ్యులుగా, గవర్నర్లుగా ఇతర కీలక పదవుల్లోనూ భారతీయులు కొనసాగుతున్నారు.అటు స్థానిక సంస్థల్లోనూ మేయర్లుగా, కౌన్సిల్ సభ్యులుగా సత్తా చాటుతున్నారు.

తాజాగా వర్జీనియా డెమొక్రాటిక్ ప్రైమరీలో( Virginia Democratic Primary ) భారత సంతతికి చెందిన సుహాస్ సుబ్రమణ్యం( Suhas Subramanyam ) విజయం సాధించారు.

నవంబర్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో యూఎస్ ప్రతినిధుల సభకు పోటీ చేసేందుకు డెమొక్రాటిక్ అభ్యర్ధిని ఎంపిక చేసేందుకు మంగళవారం జరిగిన ఆ పార్టీ అంతర్గత ఎన్నికల్లో సుహాస్ విజయం సాధించారు.ఈ నియోజకవర్గంలో వాషింగ్టన్‌లోని( Washington ) కొన్ని శివారు ప్రాంతాలు భాగంగా ఉన్నాయి.గత వారం న్యూజెర్సీలో జరిగిన ప్రైమరీలలో భారతీయ అమెరికన్ రాజేశ్ మోహన్( Rajesh Mohan ) హౌస్ టికెట్ కోసం రిపబ్లికన్ ప్రైమరీలో విజయం సాధించారు.

Advertisement

అయితే అది బలమైన డెమొక్రాటిక్ నియోజకవర్గం కావడంతో తీవ్రమైన పోటీని ఎదుర్కొన్నారు.

సుహాస్ సుబ్రహ్మణ్యానికి ఇటీవల పదవీ విరమణ చేసిన హౌస్ సభ్యురాలు జెన్నిఫర్ వెక్ట్స్‌న్ మద్ధతు పలికారు.ఆమె 2018లో ఈ సీటును డెమొక్రాటిక్ పార్టీ చేతుల్లోకి తెవడంతో పాటు రెండు సార్లు ఎన్నికయ్యారు.2022లో 53 శాతం ఓట్లను గెలుచుకున్న ఆమె పార్టీకి సురక్షితమైన సీటుగా నిలబెట్టారు.బెంగళూరుకు చెందిన సుబ్రహ్మణ్యం .అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు( Barack Obama ) సాంకేతిక సలహాదారుగా సైబర్ భద్రత, ప్రభుత్వ ఏజెన్సీలను ఆధునీకరించడంలో పనిచేస్తున్నారు.సుహాస్.2019లో, గతేడాదిలోనూ వర్జీనియా జనరల్ అసెంబ్లీకి, స్టేట్ సెనేట్‌కు ఎన్నికయ్యారు.వాలంటరీ వైద్యుడిగా, ఫైర్‌ఫైటర్‌గానూ సేవలందిస్తున్నారు.

2024లో జరగనున్న యూఎస్ కాంగ్రెస్( US Congress ) ఎన్నికల రేసులోనూ మరింత మంది భారతీయ అభ్యర్ధులు నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.అమీబేరా, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమీలా జయపాల్‌, శ్రీ థానేదర్‌లు యూఎస్ కాంగ్రెస్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్న భారత మూలాలున్న వ్యక్తులు.అమీబేరా వీరందరిలోకి సీనియర్.

ఆయన కాలిఫోర్నియాలోని 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి , కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెషనల్ జిల్లా నుంచి రో ఖన్నాలు ప్రాతనిథ్యం వహిస్తున్నారు.రాజా కృష్ణమూర్తి ఇల్లినాయిస్‌లోని 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి , ప్రమీలా జయపాల్ వాషింగ్టన్‌ లోని 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి సేవలందిస్తున్నారు.

బాలయ్య టాక్ షోకు పోటీగా రానా టాక్ షో.. ఆ ప్రముఖ షోకు హాజరయ్యే గెస్టులు వీళ్లే!
వయనాడ్ ఎన్నికల బరిలోకి నవ్య హరిదాస్.. అసలు ఎవరు ఈమె..?

అమెరికా పార్లమెంట్ లోపల భారత సంతతికి చెందిన ఎంపీల గ్రూప్‌ను ‘‘ సమోసా కాకస్ ’’‌గా( Samosa Caucus ) వ్యహరిస్తున్నారు.సుహాస్, మోహన్‌లు గనుక గెలిస్తే సమోసా కాకస్ పరిధి మరింత విస్తరిస్తుంది.

Advertisement

తాజా వార్తలు