భారత సంతతికి చెందిన ప్రఖ్యాత స్టాండప్ కమెడియన్, 2021 అమెరికాస్ గాట్ టాలెంట్ కంటెస్టెంట్ కబీర్ సింగ్ ( Kabir Singh )హఠాన్మరణం చెందారు.ఆయన వయసు 39 సంవత్సరాలు.
విలక్షణమైన కామెడీ టైమింగ్‌కు పెట్టింది పేరైన కబీర్.ప్రేక్షకులపై బలమైన ముద్ర వేశారు.
అయితే ఆయన మరణానికి దారి తీసిన కారణాలు తెలియరాలేదు.కబీర్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
కబీర్‌కు కాబోయే భార్య ప్రకటనను బట్టి.ఆయన డిసెంబర్ 4న కన్నుమూసినట్లుగా తెలుస్తోంది.డిసెంబర్ 5న కబీర్ మిత్రుడు జెరెమీ కర్రీ( Jeremy Curry ) అతని మరణం గురించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు.తన మిత్రుడు నిద్రలో ప్రశాంతంగా కన్నుమూసినట్లు తెలిపారు.
ఇది నా జీవితంలో చేసిన అత్యంత విషాదకరమైన పోస్ట్ అని జెరెమీ ఆవేదన వ్యక్తం చేశారు.కబీర్ సింగ్ అంత్యక్రియలు డిసెంబర్ 14న హేవార్డ్‌లో ( Hayward )జరుగుతాయని జెరెమీ కర్రీ తెలిపారు.
అమెరికాస్ గాట్ టాలెంట్ కూడా ఎక్స్‌లో కబీర్ సింగ్ మృతికి సంతాపం తెలిపింది.
కబీజీ అంటూ ప్రఖ్యాతి గాంచిన కబీర్ సింగ్ 2021లో తన ఎలిమినేషన్‌కు ముందు అమెరికాస్ గాట్ టాలెంట్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకున్నారు.అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్‌లో భారతీయ తల్లిదండ్రులకు జన్మించిన కబీర్ సింగ్.ముంబైలో కొంతకాలం పాటు నివసించాడు.కామెడీని కమ్యూనికేట్ చేయడానికి మూడు వేర్వేరు భాషలను నేర్చుకున్నాడు.13 ఏళ్ల వయసులో తిరిగి అమెరికాలో అడుగుపెట్టారు కబీర్ సింగ్.తన చుట్టూ ఉన్న సమాజాన్ని జాగ్రత్తగా పరిశీలించి కామెడీకి కావాల్సిన సరుకు సిద్ధం చేసుకునేవాడు.
2014లో తన స్టాండ్ అప్ కామెడీ ప్రయాణాన్ని ప్రారంభించిన కబీర్ సింగ్.కామెడీ సెంట్రల్‌లో ఎంట్రీ ఇచ్చాడు.ప్రతిష్టాత్మక శాన్‌ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ పోటీలో( San Francisco International Competition ) విజయం సాధించడంతో పాటు ప్రముఖ టీవీ సిరీస్ ఫ్యామిలీ గైలోనూ కబీర్ కనిపించారు.
ఆయన హఠాన్మరణం పట్ల భారతీయ అమెరికన్ కమ్యూనిటీ, హాస్య ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.