Amar Singh Australia : భారత సంతతి సిక్కు వ్యక్తికి ‘‘ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’’.. !!

భారత సంతతికి చెందిన సిక్కు అమర్‌సింగ్‌ (41) ను ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ రాష్ట్రం ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించింది.

ఈ ఏడాదికి గాను ‘‘ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్ ’’ అవార్డుకు ఎంపిక చేసింది.

వరదలు, కార్చిచ్చు, కరువు, కోవిడ్ 19 కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సమాజానికి మద్ధతుగా నిలిచినందుకు గాను అమర్‌సింగ్‌ను ఈ అవార్డ్‌కు ఎంపిక చేశారు.‘‘టర్బన్స్ 4 ఆస్ట్రేలియా’’ సంస్థ ద్వారా ఆర్ధిక ఇబ్బందులు, ఆహార అభద్రత, నిరాశ్రయులైన వ్యక్తులు, ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రభావితమైన వ్యక్తులకు సహాయం చేస్తున్నారు.

లోకల్ హీరో విభాగంలో అవార్డ్ పొందిన అమర్‌సింగ్.తన సిక్కు తలపాగా, గడ్డం కారణంగా జాతి విద్వేష వ్యాఖ్యలను, అవమానాలను అనుభవించిన తర్వాత 2015లో స్వచ్ఛంద సంస్థను స్థాపించినట్లు న్యూసౌత్‌వేల్స్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ సందర్భంగా తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలను ఆయన గుర్తుచేసుకున్నారు.తన సహోద్యోగి తనను టెర్రరిస్టులా వున్నాడని అన్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement

ఒకసారి వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా.తలపాగా కింద ఏదో దాస్తున్నానని, కొందరేమో బాంబును తీసుకెళ్తున్నావా అంటూ హేళన చేశారని అమర్ సింగ్ వాపోయాడు.

ఈ సంఘటనల నేపథ్యంలో ఆస్ట్రేలియన్లు సిక్కులను విశ్వసనీయ వ్యక్తులుగా, ఆపద సమయాల్లో ఆశ్రయించదగ్గ వ్యక్తులుగా చూడాలని తాను కోరుకున్నట్లు ఆయన చెప్పారు.ఇకపోతే.

యుక్త వయసులో వుండగా ఆస్ట్రేలియాకు వెళ్లారు అమర్‌సింగ్.ఆయనకు చిన్నప్పటి నుంచి సమాజసేవపై మక్కువ ఎక్కువ.

ప్రతి వారం ఆయన తన సంస్థతో కలిసి వెస్ట్రన్ సిడ్నీలో తిండి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 450 మందికి నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు.అలాగే కరువును ఎదుర్కొంటున్న రైతులకు ఎండుగడ్డిని కూడా పంపిణీ చేశారు.

నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్ ను ట్రై చేయండి!
సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?

లిస్మోర్‌లోని వరద బాధితులకు , సౌత్ కోస్ట్‌లోని బుష్ ఫైర్ ప్రభావిత ప్రజలకు సామాగ్రి, కోవిడ్ 19 సమయంలో ఒంటరిగా వున్న వారికి ఆహారాన్ని అందించారు అమర్ సింగ్.

Advertisement

అంతేకాదు.టర్బన్ ఫెస్ట్ ఈవెంట్‌ల ద్వారా ఆస్ట్రేలియాలోని పలు నగరాల్లోని ప్రజలకు సిక్కు కమ్యూనిటీ గురించి బోధిస్తున్నారు.రాబోయే తరాల వారు తలపాగాలు, గడ్డాలను చూసి భయపడకూడదన్నదే తమ ధ్యేయమన్నారు.

అమర్ సింగ్ 2021లో ఆర్డర్ ఆఫ్ లివర్‌పూల్ (గౌరవ) సభ్యునిగా నిలిచారు.గతంలో సిడ్నీ 2000 ఒలింపిక్ గేమ్స్ , ఇన్విక్టస్ గేమ్స్, గోల్డ్ కోస్ట్ కామన్‌వెల్త్ గేమ్స్ సమయంలో స్వచ్ఛందంగా పనిచేశారు.

తాజా వార్తలు