కోవిడ్‌పై పోరాటం.. సింగపూర్‌లో భారత సంతతి అధికారికి ప్రతిష్టాత్మక పురస్కారం

కోవిడ్ 19 వ్యాక్సినేషన్ వెనుక కీలకపాత్ర పోషించిన భారత సంతతికి చెందిన ప్రజారోగ్య అధికారి దినేష్ వాసు దాస్‌ని సింగపూర్ ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ స్టార్ అవార్డ్‌తో సత్కరించింది.

ఆయనతో పాటు మరో 32 మందిని కూడా ఈ అవార్డ్‌కు ఎంపిక చేశారు.

ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని క్రైసిస్ మేనేజ్‌మెంట్ స్ట్రాటజీ, ఆపరేషన్స్ గ్రూప్ డైరెక్టర్‌గా దినేష్ వ్యవహరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

సింగపూర్ వాసుల జీవితాలు, జీవనోపాధిపై కోవిడ్ ప్రభావం తక్కువగా వుండేలా చూశామన్నారు.అలాగే నిబద్ధత, అభిరుచి, వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించే అత్యుత్తమ బృందాన్ని కలిగి వున్నందుకు గర్వంగా వుందని దినేష్ పేర్కొన్నారు.

సింగపూర్ అంతటా వ్యాక్సిన్‌ కేంద్రాలను వేగంగా ఏర్పాటు చేయడంతో పాటు ఫైజర్ బయోఎన్‌టెక్ టీకాలను అందుబాటులో వుంచడంలో దినేశ్ కీలకపాత్ర పోషించారు.అలాగే mRNA వ్యాక్సిన్‌లను కరిగిన ఆరు గంటలలోపు ఇవ్వాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.17 మిలియన్లకు పైగా కోవిడ్ 19 వ్యాక్సిన్ డోస్‌లను అందజేయగలిగామని దినేష్ పేర్కొన్నారు.ఆయనతో పాటు సింగపూర్ షిప్పింగ్ అసోసియేషన్ (ఎస్ఎస్ఏ) ప్రెసిడెంట్ అండ్ ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ షిప్పింగ్ వైస్ చైర్ కరోలిన్ యాంగ్‌కు కూడా ఈ అవార్డ్ దక్కింది.

Advertisement

సీవాక్స్ అని పిలిచే కరోనా టీకా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ఆమె కీలకపాత్ర పోషించారు.

ఈ సందర్భంగా కరోలిన్ మాట్లాడుతూ.ఇవాళ్టీ వరకు తమ నౌకాశ్రయానికి వచ్చిన 1000 మంది నావికులకు టీకా అందజేసినట్లు తెలిపారు.కోవిడ్ 19కి వ్యతిరేకంగా చేసిన పోరాటానికి గాను 1,00,000 మందికి పైగా ప్రజలు అవార్డులు అందుకుంటారని సింగపూర్ ప్రధానమంత్రి కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.

ఇకపోతే.పబ్లిక్ హెల్త్ కేర్ సెక్టార్ నుంచి 4,000 మంది, పబ్లిక్ సెక్టార్ నుంచి 4,500 మంది.ప్రైవేట్ సెక్టార్ నుంచి 9,500 మంది జాతీయ అవార్డులు (కోవిడ్ 19) అందుకోనున్నారు.

వైద్య సంరక్షణ, నిఘా, పరీక్షలను అందించడం, టీకా డ్రైవ్‌, డార్మెటరీ కార్యకలాపాలను నిర్వహించడం వంటి విభాగాల్లో ఈ అవార్డ్‌లను అందించనున్నారు.

వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

Advertisement

తాజా వార్తలు