2022 జనవరిలో జరిగిన మావన అక్రమ రవాణా ఘటనపై విచారించేందుకు గాను భారత సంతతికి చెందిన వ్యక్తిని అమెరికాలోని చికాగో( Chicago )లో అరెస్ట్ చేశారు.ఇద్దరు పిల్లలతో సహా నలుగురితో కూడిన గుజరాత్ కుటుంబం కెనడా నుంచి చట్టవిరుద్ధంగా యూఎస్‌లోకి ప్రవేశించడానికి యత్నిస్తూ వుండగా వారు గడ్డకట్ట చలిని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన ఘటనపై అమెరికా అధికారులు విచారిస్తున్నారు.
దీనిలో భాగంగా హర్షకుమార్ రామన్‌లాల్( Harshkumar Ramanlal ) పటేల్‌ను చికాగోలోని ఓ హేర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అరెస్ట్ చేశారు.ఆయన ఫిబ్రవరి 28న నిర్బంధ విచారణకు హాజరవుతారని చికాగో ట్రిబ్యూన్ నివేదించింది.

డర్టీ హ్యారీ, పరంసింగ్, హరేష్ రమేశ్‌లాల్ పటేల్ అనే మారు పేర్లున్న పటేల్‌పై అక్రమంగా విదేశీయులను రవాణా చేయడం, ఇందుకు కుట్ర పన్నడం వంటి అభియోగాలు మోపారు. మానవ అక్రమ రవాణా కుట్ర( Illegal Travel )లో పటేల్ ప్రమేయం గురించి సవివరమైన సమాచారాన్ని మిన్నెసోటా జిల్లా కోర్టులో పటేల్‌పై అఫిడవిట్, క్రిమినల్ కేసు నమోదైంది.అఫిడవిట్ ప్రకారం.జనవరి 19, 2022న జరిగిన మానవ అక్రమ రవాణాపై దర్యాప్తు చేస్తున్నారు.భారత్‌లోని గుజరాత్‌కు చెందిన జగదీష్ పటేల్ 39, వైశాలిబెన్ పటేల్ 37, విహంగీ పటేల్ 11, మరియు ధార్మిక్ పటేల్ 3లు.యూఎస్ కెనడా సరిహద్దులోని ఎమర్సన్, మానిటోబా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ గడ్డకట్టే చలిని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు.
వీరి మృతదేహాలను బోర్డర్ పెట్రోలింగ్ అధికారులు( Border Petrolling Officials ) స్వాధీనం చేసుకుని.ఈ కేసుకు సంబంధించి స్టీవ్ షాండ్ (47)ను అరెస్ట్ చేశారు.
కెనడా నుంచి పటేల్ కుటుంబాన్ని యూఎస్‌కి అక్రమంగా తరలించడానికి అతను కుట్ర పన్నినట్లుగా అభియోగాలు మోపారు.హర్షకుమార్ పటేల్, షాండ్ మధ్య కమ్యూనికేషన్ వివరాలను ఫిర్యాదులో ప్రస్తావించారు.
ఫ్లోరిడాలోని గ్యాంబ్లింగ్ స్థాపనకి పటేల్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారని షాండ్ చెప్పాడు.

అద్దె కార్లు, హోటళ్లు, షాండ్‌కి చెల్లింపుల ఏర్పాట్లపై వీరిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు అధికారులు తెలిపారు.జనవరి 19, 2022న నార్త్ డకోటా, మిన్నెసోటాలలో తీవ్రమైన వాతావరణం గురించి కూడా ఇద్దరూ చర్చించుకున్నారు.మంచు తుఫాను పరిస్ధితుల నేపథ్యంలో అందరూ దుస్తులు ధరించారో లేదో చూడాలని షాండ్‌తో పటేల్ ఓ సందేశంలో అన్నాడు.
ఈ కేసుకు సంబంధించి ఢిల్లీలోని హోంలాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ (హెచ్ఎస్ఐ) అధికారి.ఫిబ్రవరి 2022లో గుజరాత్ పోలీసులతో సమావేశమైనట్లుగా అఫిడవిట్ పేర్కొంది.







