నెలకు రూ.9 లక్షలు సంపాదిస్తున్న ఎన్నారై.. అదెలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారంతే..

రియల్ ఎస్టేట్ వ్యాపారంలో( Real Estate ) వచ్చిన లాభాలు మరే వ్యాపారంలో రావని చెప్పుకోవచ్చు.

ఇందులో సరేనా స్ట్రాటజీలు ఫాలో అయితే చాలా డబ్బులు వెనకేసుకోవచ్చు.

ఆ విషయాన్ని భారతీయ సంతతికి చెందిన వ్యాపారవేత్త కరుణ్ విజ్( Karun Vij ) మరోసారి నిరూపించారు.కెనడాలో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు కరుణ్ లాభదాయకమైన రియల్ ఎస్టేట్ వ్యూహాన్ని కనుగొన్నారు.

మొత్తం ఇంటిని ఒకే అద్దెదారుకు లీజుకు ఇవ్వడం కంటే విద్యార్థులకు వ్యక్తిగత గదులను అద్దెకు ఇవ్వడం వల్ల అధిక లాభాలు పొందవచ్చని ఆయన గమనించారు.ఈ అవగాహనతో అతను కెనడాలో( Canada ) 28 గదులతో నాలుగు ప్రాపర్టీలను కొనుగోలు చేయగలిగారు.ఆయన ఈ ప్రాపర్టీలను అద్దెకు ఇస్తూ నెలకు రూ.9 లక్షలకు పైగా ఆదాయం సంపాదిస్తున్నారు.అతని రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియో విలువ సుమారు 2.3 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.19 కోట్లు).

2016లో, 26 సంవత్సరాల వయస్సులో, విజ్ కెనడాలోని అంటారియోలో( Ontario ) తన మొదటి పెట్టుబడి పెట్టారు.323,904 డాలర్ల (రూ.2.7 కోట్లు) ధర గల ఆస్తిని ఏడుగురు కళాశాల విద్యార్థులకు అద్దెకు ఇచ్చారు.ఈ ప్రాంతంతో అతనికున్న పరిచయం, కెనడియన్‌లోని అగ్రశ్రేణి యూనివర్సిటీకి సమీపంలో ఉండటం వల్ల కస్టమర్ల కోసం వెతకకుండా టైమ్ సేవ్ అవుతుంది.

Advertisement

విజ్ తన వృత్తిపరమైన కెరీర్‌తో పాటు భూస్వామిగా( Landlord ) తన పాత్రను బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు.మొదట అప్లికేషన్ ఇంజనీర్‌గా, ఇప్పుడు యూఎస్‌లో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.అద్దెలు, జీతం ద్వారా వచ్చిన డబ్బుతో ఆయన దక్షిణ అంటారియోలో అసెట్ హోల్డింగ్‌లను మరింత పెంచుకున్నారు.తన ప్రాపర్టీలో ఏ చిన్న రిపేర్ ఉన్నా వెంటనే బాగు చేయడం, బాగా కమ్యూనికేట్ చేయడం ద్వారా కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటున్నారు.2023లో, విజ్ అద్దె ఆస్తులు బ్రేక్-ఈవెన్ స్థాయికి చేరుకున్నాయి.తక్కువ రుణాలతో ఇంకా ఆస్తులను పెంచుకుంటూ పోతూ తన సంపదను ఈ ఎన్నారై( NRI ) రెట్టింపు చేసుకుంటున్నారు.

యువ వ్యాపారవేత్తలకు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు