గతేడాది అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై ( Israel ) హమాస్ జరిపిన మెరుపుదాడికి కౌంటర్‌గా ఆ ఉగ్రవాద సంస్థను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది.ఈ యుద్దంలో ఇప్పటికే భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని అంచనా.ఇప్పటి వరకు దాదాపు 80 వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని.41 వేల మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారని, 95 వేల మంది గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది.ధ్వంసమైన భవనాల కింద దాదాపు 10 వేల మృతదేహాలు ఉండొచ్చని అంటున్నారు.శిథిలాలను తొలగించడానికే 15 ఏళ్ల సమయం పడుతుందని.19 లక్షల మంది నిరాశ్రయులైనట్లుగా ఐరాస వెల్లడించింది.
మరోవైపు.హమాస్ – ఇజ్రాయెల్ యుద్ధంలో( Hamas – Israel War ) సహాయక సిబ్బంది, వాలంటీర్లు, ఐక్యరాజ్యసమితి అధికారులు ప్రాణాలు కోల్పోతుండటంపై ఐరాస ఆవేదన వ్యక్తం చేసింది.ఇటీవల నుసీరత్ ఏరియాలోని ఓ పాఠశాలపై జరిగిన వైమానిక దాడిలో ఆరుగురు సిబ్బంది మరణించినట్లుగా ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.
ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, అంతర్జాతీయ , మానవతా చట్టాలను గౌరవించాలని ఇజ్రాయెల్‌కు సూచించింది.
కాగా.వెస్ట్‌బ్యాంక్‌లో( Westbank ) ఉద్రిక్తతల నేపథ్యంలో 24 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన ఇజ్రాయెల్ సైనికుడు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది.బీట్ ఎల్ సెటిల్‌మెంట్‌లో అతను మరణించినట్లుగా పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.
మృతుడిని బ్నీ మెనాషే కమ్యూనిటీకి చెందిన స్టాఫ్ సార్జెంట్ గెరీ గిడియోన్ హంఘల్‌గా( Geri Gideon Hanghal ) గుర్తించారు.నోఫ్ హగలీల్‌కు చెందిన హంఘల్.ఖ్పిర్ బ్రిగేడ్‌కు చెందిన నహ్సోన్ బెటాలియన్‌లో( Nahshon Battalion ) సైనికుడిగా పనిచేస్తున్నట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.
2020లో భారత్‌లోని ఈశాన్య ప్రాంతం నుంచి హంఘల్ ఇజ్రాయెల్‌కు వలస వెళ్లాడు.బ్నీ మెనాషే కమ్యూనిటీకి చెందిన దాదాపు 300 మంది యువకులు హమాస్ – ఇజ్రాయెల్ యుద్ధంలో పాల్గొన్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.భారత్‌లోని మణిపూర్, మిజోరంలకు చెందిన బ్నీ మెనాషే కమ్యూనిటీ.
ప్రాచీనకాలంలో మెనాస్సే ఇజ్రాయెల్ తెగకు చెందినవారమని నమ్ముతారు.గడిచిన ఐదేళ్లలో ఈ కమ్యూనిటీకి చెందిన దాదాపు 1500 మంది సభ్యులు భారత్ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్లినట్లుగా తెలుస్తోంది.