Theranos Fraud Case : అమెరికాలో భారత సంతతి ఎగ్జిక్యూటివ్‌కు 13 ఏళ్ల జైలు... ఏం చేశాడంటే..?

ఇన్వెస్టర్లను మిలియన్ డాలర్ల మేర మోసం చేసిన అభియోగంపై భారత సంతతికి చెందిన ఎగ్జిక్యూటివ్‌కు అమెరికా కోర్ట్ 13 ఏళ్లు జైలు శిక్ష విధించింది.నిందితుడిని అమెరికన్ డయాగ్నోస్టిక్స్ కంపెనీ ‘‘థెరానోస్’’ మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రమేశ్ సన్నీ బల్వానీగా గుర్తించారు.

 Indian Origin Executive Ramesh Balwani Sentenced To 13 Years In Prison For Fraud-TeluguStop.com

ఇతను థెరానోస్ బ్లడ్ ఎనాలిసిస్ టెక్నాలజీ ఖచ్చితత్వాన్ని తప్పుగా చూపించి.కంపెనీ పెట్టుబడిదారులను , రోగులను మోసగించాడు.

ఈ కేసుకు సంబంధించి బుధవారం కాలిఫోర్నియాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తి 12 సంవత్సరాల 11 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.అంతేకాకుండా జైలు నుంచి విడుదలయ్యాక… బల్వానీకి మూడేళ్ల పర్యవేక్షణ శిక్ష కూడా విధించారు.

దీనితో పాటు భవిష్యత్తులో బల్వానీ చెల్లించాల్సిన రిస్టిట్యూషన్ మొత్తాన్ని నిర్ణయించడానికి సంబంధించి విచారణ జరగాల్సి వుంది.జైలు శిక్షను అనుభవించడం కోసం మార్చి 15, 2023న లొంగిపోవాలని న్యాయస్థానం అతనిని ఆదేశించింది.
అటార్నీ జనరల్ స్టెఫాన్ హింద్ మాట్లాడుతూ.సిలికాన్ వ్యాలీ టైటాన్ కావాలనే కోరికతో బల్వానీ… రోగి భద్రత కంటే వ్యాపారంలో విజయానికి, వ్యక్తిగత సంపద పెంచుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు.

అంతేకాకుండా తన పెట్టుబడిదారులకు కూడా సరిగా న్యాయం చేయలేదని హింద్ దుయ్యబట్టారు.విచారణ సందర్భంగా… బల్వానీకి వ్యక్తిగత సంపద పెరిగినట్లు తేలింది.అతను థెరానోస్‌లో 30 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను కలిగి వున్నాడని, ఇవి కంపెనీలో ఆరు శాతమని చెప్పాడు.

Telugu Start, Theranosramesh, Ramesh Balwani, Tech Fraud, Theranos Fraud-Telugu

బల్వానీ పాకిస్తాన్‌లో జన్మించినప్పటికీ అతని కుటుంబం తర్వాతి కాలంలో భారత్‌కు వలస వెళ్లిందని చెబుతారు.ఆయన 1980లలో భారత్ నుంచి అమెరికాకు వెళ్లాడు.ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్ ఇన్‌ఛార్జ్ రాబర్ట్ ట్రిప్ మాట్లాడుతూ.

పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించేందుకు బల్వానీ థెరానోస్ బ్లడ్ టెస్ట్‌ టెక్నాలజీలో లోపాలను ఉద్దేశ్యపూర్వకంగా దాచిపెట్టడమే కాకుండా , రోగుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేశాడని తెలిపారు.థెరానోస్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో బోర్డ్ మెంబర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ప్రెసిడెంట్ పదవులను రమేశ్ సన్నీ బల్వానీ నిర్వహించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube