Bhavini Patel : యూఎస్ కాంగ్రెస్ ఎన్నికల బరిలో భారత సంతతి మహిళ.. ఎవరీ భవినీ పటేల్..?

అమెరికన్ చట్టసభల్లో ప్రాతినిథ్యం వహించేందుకు ప్రవాస భారతీయులు ఉత్సాహం చూపుతున్నారు.గడిచిన కొన్నేళ్లుగా ఈ విషయంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.తాజాగా ఇండో అమెరికన్ మహిళ భవినీ పటేల్( Bhavini Patel ) యూఎస్ ప్రతినిథుల సభకు పోటీ చేయాలని భావిస్తున్నారు.30 ఏళ్ల భవినీ పటేల్ గతేడాది అక్టోబర్ 2న .12వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి పోటీ చేయాలనే తన ఉద్దేశాన్ని ప్రకటించారు.ఏప్రిల్ 23న షెడ్యూల్ చేసిన ప్రైమరీకి గాను పటేల్ 3,10,000 డాలర్ల నిధులు సేకరించారు.

 Indian Origin Bhavini Patel Now Running For Us Congress-TeluguStop.com

అందులో 70 శాతం పెన్సిల్వేనియా నుంచే సేకరించినట్లు ఆమె చెప్పారు.చిన్న చిన్న పట్టణాల మేయర్‌లతో పాటు ఆయా ప్రాంతాల్లోని కౌన్సిల్ సభ్యులు సహా 33 మంది ఎన్నికైన అధికారుల మద్ధతును భవినీ పొందారు.

Telugu Bhavini Patel, Carnegie Mellon, Gujarat, Indian Origin, Joe Biden, Pennsy

భవినీ పటేల్ .అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌( Joe Biden )కు కరడుగట్టిన మద్ధతుదారు.తాము చూసిన అత్యంత ప్రగతిశీల అధ్యక్షులలో బైడెన్ ఒకరని ఆమె తెలిపారు.మౌలిక సదుపాయాల బిల్లు, ద్రవ్యోల్బణం తగ్గింపు చట్టం వంటి కీలక బిల్లులను బైడెన్ తీసుకొచ్చారని భవినీ ప్రశంసించారు.

ఈమె మూలాలు భారత్‌లోని గుజరాత్‌( Gujarat )లో వున్నాయి.భవినీ తల్లి ఓ వలసదారుగా అమెరికాకు వచ్చింది.తన జిల్లాలో సానుకూల ప్రచారాన్ని నిర్వహిస్తున్నప్పటికీ.జాతి విద్వేషానికి ఆమె గురయ్యారు.

దీంతో దేశవ్యాప్తంగా హిందూ, యూదు సంఘాలు పటేల్‌కు మద్ధతుగా నిలిచాయి.హిందూ అమెరికన్ పీయూసీ భవినీ కోసం నిధుల సేకరణను సైతం నిర్వహించింది.

Telugu Bhavini Patel, Carnegie Mellon, Gujarat, Indian Origin, Joe Biden, Pennsy

తాము కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ, పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయం, ఇతర విశ్వవిద్యాలయ సంస్థలకు కేంద్రంగా వున్నామని భవినీ పటేల్ అన్నారు.చాలా మంది విద్యార్ధులు భారత్ నుంచి ఇక్కడికి వస్తున్నారని.వారు డిగ్రీలు సంపాదిస్తారని, ప్రజలు వర్సిటీలలోకి, వర్క్‌ఫోర్స్‌లోకి స్వేచ్ఛగా ప్రవేశించడానికి, చిన్న వ్యాపారాలను నిర్మించడానికి, పటిష్టమైన వీసా ప్రోగ్రామ్‌ను రూపొందించడానికి అండగా నిలుస్తామని భవినీ తన ఎన్నికల ప్రచారంలో హామీ ఇస్తున్నారు.మన తరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభాన్ని అధిగమించడానికి కృషి చేస్తానని పటేల్ పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube