అమెరికాలో భారతీయ కుటుంబం ప్రయాణిస్తున్న కారు 250 అడుగులలోయలోకి.. అందులోని వారు..

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో భారతదేశానికి చెందిన నలుగురు ప్రయాణిస్తున్న కారు 250 అడుగుల లోయలో పడింది.భారత సంతతికి చెందిన ధర్మేశ్ పటేల్ (41) తన భార్య ఇద్దరు పిల్లలను చంపే ఉద్దేశంతోనే కారును లోయలోకి పోనిచ్చాడని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 Indian Origin American Dharmesh Patel Allegedly Drives His Car Off A Cliff Detai-TeluguStop.com

కారు పలుమార్లు పల్లీలు కొట్టి పర్వత శిఖరాలను ఢీ కొట్టిందని ప్రత్యక్షంగా చూసిన అక్కడి స్థానికులు చెబుతున్నారు.ఆశ్చర్యం కలిగించేలా కారులో ఉన్న నలుగురు కూడా బ్రతికే ఉన్నారు.

రక్షణ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని తాడు సాయంతో వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించడం జరిగింది.

వీరిలో ఇద్దరు దంపతులతో పాటు నాలుగు సంవత్సరాల బాలిక, తొమ్మిదేళ్ల బాలుడు కూడా ఉన్నారు.

వీరంతా కాలిఫోర్నియా లోని పసాడీనా ప్రాంతంలో నివసించే భారతీయ సంతతికి చెందిన ధర్మేశ్ కుటుంబమని పోలీసులు గుర్తించారు.ఉత్తర కాలిఫోర్నియాలోని పసిఫిక్ తీరంలో అతి ప్రమాదకరమైన డెవిల్స్ ఫ్లైట్ రహదారిలో టెస్లా కారు అదుపు తప్పి లోయలో పడిపోయిందని సోమవారం అధికారులకు సమాచారం వెళ్ళింది.

వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది కారులో ఉన్న వారు మృతి చెంది ఉంటారని అధికారులు, రక్షణ సిబ్బంది మొదట భావించారు.

కారులోని వారందరూ బతికే ఉన్నారని తెలుసుకొని హెలికాప్టర్ ను రంగంలోకి దించి నలుగురి ప్రాణాలను సురక్షితంగా కాపాడారు.పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి.ఆ తర్వాత ఈ కేసును పోలీసులు పలుకొనాలలో విచారణ మొదలుపెట్టారు.

తన భార్య పిల్లలను చంపేందుకు ధర్మేష్ ఇంత దుస్సహసానికి పూనుకున్నట్లు అధికారులు నిర్ధారణ చేశారు.చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే ధర్మేశ్ ను అరెస్ట్ చేశారు.

ముగ్గురి హత్యకు కుట్ర, ఇద్దరు చిన్నారులను వేధించడం వంటి వేరువేరు సెక్షన్లను కింద ధర్మేష్ పై కేసు నమోదు చేస్తున్నట్లు అమెరికా మీడియా వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube