ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రభుత్వ రిట్ అప్పీల్ పిటిషన్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది.సిట్ దర్యాప్తు రద్దు చేసి కేసును సీబీఐకి బదిలీ చేయాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణ చేపట్టగా… ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ దుశాంత్ దవే వాదనలు వినిపించనున్నారు.ప్రతివాదుల్లో వ్యక్తిగత హోదాలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్ రెడ్డి, తుషార్, నందకుమార్, రామచంద్ర భారతి, సింహయాజితో పాటు కేంద్ర ప్రభుత్వం, సీబీఐని ప్రభుత్వం ప్రతివాదులుగా చేర్చింది.
ఈ క్రమంలో హైకోర్టు విచారణకు సీబీఐ అధికారులతో పాటు ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్ రెడ్డి హాజరైయ్యారు.