సింగపూర్‌లో విషాదం .. వర్క్ ప్లేస్‌లో ప్రమాదం, విధులు నిర్వర్తిస్తూనే భారతీయ కార్మికుడు మృతి

సింగపూర్‌( Singapore )లో విషాదం చోటు చేసుకుంది.

ఇక్కడి జురాంగ్ వెస్ట్ ఇండస్ట్రియల్ రీజియన్‌లోని ఒక వర్క్ సైట్‌లో వాహనం రివర్స్ చేస్తూ ఢీకొనడంతో 33 ఏళ్ల భారతీయ కార్మికుడు మరణించాడు.

మృతుడు టిప్పర్ ట్రక్కును అన్‌లోడ్ చేయడానికి సిద్దం చేస్తున్నాడు.అదే సమయంలో నిర్మాణ ప్రదేశాలలో భారీ వస్తువులను ఎత్తడానికి ఉపయోగించే రివర్సింగ్ వీల్ లోడర్‌ అతనిని ఢీకొట్టినట్లు బుధవారం సింగపూర్ మానవశక్తి మంత్రిత్వ శాఖ (ఎంవోఎం)ను ఉటంకిస్తూ ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది.

మృతుడిని బీఎస్ఎన్ టెక్ ఇంజనీరింగ్‌లో పనిచేసే డ్రైవర్‌గా గుర్తించారు.ఇతను స్టార్ రెడీ మీక్స్ సైట్‌లో పనిచేస్తున్నాడు.

సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్, పారామెడిక్‌ ఏజెన్సీలు భారతీయ కార్మికుడు సంఘటనా స్థలంలోనే మరణించినట్లు ప్రకటించారు.

Advertisement

బుధవారం మధ్యాహ్నం 3.40 గంటకు ఫస్ట్ బురో క్లోజ్ వద్ద ఈ ప్రమాదం జరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.దీనిపై విచారణ జరుపుతున్నామని.

ఘటనాస్థలిలో అన్ని వాహనాల కార్యకలాపాలను నిలిపివేయాలని స్టార్ రెడీ మిక్స్‌ను కూడా ప్రభుత్వం ఆదేశించింది.సాధారణ భద్రతా చర్యగా.

వాహనాల కారణంగా జరిగే ప్రమాదాలు తగ్గించడానికి యజమానులు సరైన ట్రాఫిక్ నిర్వహణ ప్రణాళికను అమలు చేయాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది.అననుకూల వాహనాల కార్యకలాపాలు ఒకే సమయంలో జరగకుండా చూసుకోవాలని సూచించింది.

వర్క్ ప్లేస్ సేఫ్టీ అండ్ హెల్త్ (డబ్ల్యూఎస్‌హెచ్)( Workplace Safety and Health ) చట్టాలను ఉల్లంఘించినా, మరణం లేదా తీవ్రమైన గాయానికి కారణమైనా గతంలో విధించే 20 వేల సింగపూర్ డాలర్ల జరిమానాను 50000 సింగపూర్ డాలర్లకు పెంచింది.సింగపూర్‌లో జూన్ 21 నాటికి వర్క్ ప్లేస్‌లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.2022లో ఈ సంఖ్య 46 కాగా.2016లో అత్యధికంగా 66 మంది మరణించారు.

సమంత నాగచైతన్య విడాకులకు పిల్లలే కారణమా.. అసలు విషయం బయటపెట్టిన చైతన్య?
రహస్యంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ సింగర్లు.. ఈ జోడి క్యూట్ కపుల్ అంటూ?

ఇకపోతే.గతేడాది కూడా విధి నిర్వహణలో వుండగానే ప్రమాదవశాత్తూ సముద్రంలో పడి భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు.నవంబర్ 25వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో మెర్లిమావు రోడ్‌లోని సింగపూర్ రిఫైనింగ్ కంపెనీలో బాధితుడు విధుల్లో వుండగా ఈ ఘటన జరిగిందని ఛానెల్ న్యూస్ ఏషియా నివేదించింది.వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించి అతని మృతదేహాన్ని వెలికి తీశారు.41 ఏళ్ల మృతుడు గతంలో ప్లాంట్ జనరల్ సర్వీసెస్‌లో పనిచేశాడు.ఎంవోఎం (మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్) ప్రమాదంపై దర్యాప్తు చేస్తోంది.

Advertisement

రిఫనరీల్లో పరంజా ( scaffolding operations) పనులను నిలిపివేయాలని బాధితుడు పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు న్యూస్ ఏషియా తెలిపింది.సముద్రాలు, భారీ నీటి వనరుల సమీపంలో పనిచేసే కార్మికుల భద్రతపై యాజమాన్యాలు దృష్టి సారించాలని ఎంవోఎం కోరింది.

అయితే సింగపూర్‌లో ఈ తరహా ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు.

తాజా వార్తలు