రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరుపున ప్రచారం చేయనున్న ప్రవాస భారతీయురాలు కమలా హారీస్ గురించి అందరికి తెలిసిందే అయితే అమెరికా అధ్యక్ష రేసులో ఉండే వాళ్ళు తప్పకుండా తాము కట్టిన పన్నుల వివరాలను విడుదల చేయాలని 2017లో ఓ ప్రతిపాదన వచ్చింది.అందుకు తగ్గట్టుగా కమలా హారీస్ తో పాటు కొంతమంది డెమోక్రాటిక్ పార్టీ తరుపున పోటీలో ఉన్న కొందమంది సెనేటర్స్ తాము కట్టిన పన్నుల వివరాలు తెలిపారు.
కమలా హారీస్ కూడా 2004 నుంచి 2018 వరకు అమెరికా ప్రభుత్వానికి తాను కట్టిన పన్నుల వివరాలు తెలిపారు.2014లో డగ్లస్ ఎమ్‌హాఫ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సమయం మొదలు ఇప్పటి వరకూ కూడా ఇద్దరూ కలిసి చెల్లించిన ట్యాక్స్ లని వెల్లడించారు.

ఒక్క 2018లోనే వీరిద్దరి ఆదాయం 1.89 మిలయన్ డాలర్లు ఉంది అంటే సుమారు రూ.13 కోట్లు.ఇందులో ట్యాక్స్ లకిగాను 6 లక్షల 97వేల డాలర్లు అంటే దాదాపు రూ.5 కోట్లు పన్నులు చెల్లించినట్టు తెలిపారు.ఇదిలాఉంటే ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వారిలో కేవలం డొనాల్డ్ ట్రంప్ మాత్రం తన పన్నుల వివరాలను బయటపెట్టలేదు.







