గ్రాండ్ గా ప్రారంభమైన ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 2

తెలుగు సంగీత ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సింగింగ్‌ షో సెకండ్ సీజన్ రాబోతుంది.తాజాగా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కర్టెన్‌ రైజర్ ప్రోగ్రాం వేడుకగా జరిగింది.

 Telugu Indian Idol Season 2 Started Grandly, Telugu Indian Idol , Geetha Madhur-TeluguStop.com

ఈ కార్యక్రమానికి సీఈవో అజిత్‌ ఠాకూర్‌, ప్రముఖ సింగర్లు, ఎస్‌.ఎస్‌.థమన్‌, కార్తీక్‌, గీతామాధురి హేమచంద్ర తదితరలు హాజరయ్యారు.

ప్రముఖ ఓటీటీ మాధ్యమం ఆహాలో సూపర్ హిట్ అయిన షోలలో తెలుగు ఇండియన్ ఐడల్ ఒకటి.యంగ్ సింగర్స్‌కు తమ ట్యాలెంట్‌ నిరూపించుకోవడానికి ఈ సింగింగ్‌ షో మంచి వేదికగా నిలిచింది.సింగర్ శ్రీరామచంద్ర హోస్ట్ గా.

మ్యూజిక్ డైరెక్టర్ థమన్, హీరోయిన్ నిత్యామీనన్.సింగర్ కార్తీక్ జడ్జీలుగా వ్యవహరించి సందడి చేశారు.

జయంత్, వాగ్దేవి , శ్రీనివాస్, వైష్ణవి , ప్రణతీ లాంటి తెలుగు సింగర్లు ఈ షోలో తమ పాటలతో మెప్పించారు.అయితే చివరకు సింగర్‌ వాగ్దేవి విజేతగా నిలిచింది.

గ్రాండ్‌ ఫినాల్ కు మెగాస్టార్ చిరంజీవి వచ్చేసి సందడి చేశారు.

ఇలా తెలుగు సంగీత ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సింగింగ్‌ షో సెకండ్ సీజన్ రాబోతుంది.

అయితే తాజా సీజన్‌లో సింగర్‌ హేమచంద్ర సింగింగ్‌ షోను హోస్ట్‌ చేయనున్నారు.ఇక జడ్జీల విషయానికొస్తే… సింగర్‌ నిత్యామేనన్‌ ప్లేస్‌లో ట్యాలెంటెడ్‌ సింగర్ గీతా మాధురి రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube