ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో జరుగుతున్న రైడ్స్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ తీసినందుకే తనిఖీలు చేస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ పాలనలో దేశ ప్రతిష్ట దిగజారిపోతోందని కేఏ పాల్ వ్యాఖ్యనించారు.ఈ క్రమంలో పత్రికా స్వేచ్ఛను కేంద్రం నియంత్రించలేదన్న ఆయన అంతర్జాతీయ మీడియా నోరు మూయించగలరా అని ప్రశ్నించారు.
డాక్యుమెంటరీ నచ్చకపోతే కోర్టుకి వెళ్లాలని చెప్పారు.అనంతరం తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై స్పందించిన ఆయన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను త్వరలోనే అరెస్ట్ చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏప్రిల్ 14న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభిస్తామని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడాతనంటూ హెచ్చరించారు.