కాళీ సినిమా పోస్టర్ వివాదం.... కెనడాలోని ఇండియన్ హైకమీషన్ సీరియస్

ప్రముఖ దర్శకురాలు లీనా మణిమేకలై ఇటీవల విడుదల చేసిన ‘కాళీ’ డాక్యుమెంటరీ ఫిలిం పోస్టర్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.సదరు పోస్టర్ లో కాళీ మాత గెటప్ లో వున్న వ్యక్తి సిగరెట్ తాగుతున్నట్లుగా చూపించడంపై హిందూ సంఘాలు, అమ్మవారి భక్తులు మండిపడుతున్నారు.

 Indian High Commission In Canada Serious On 'kaali' Film Poster Leena Manimekala-TeluguStop.com

దీనికి తోడు కాళీ మాత చేతిలో స్వలింగ సంపర్కుల కమ్యూనిటికీ చెందిన జెండా ఉండటం వివాదానికి మరింత ఆజ్యం పోసింది.హిందువుల మనోభావాలు కించపరిచేలా వ్యవహరిస్తోన్న లీనాను అరెస్ట్ చేయాలని నెటిజన్లు సోషల్ మీడియాలో కోరుతున్నారు.

ఈ సినిమాను కెనడాలోని ఆగా ఖాన్ మ్యూజియంలో రిథమ్స్ ఆఫ్ కెనడా కార్యక్రమంలో ప్రదర్శిస్తామని లీనా వెల్లడించారు.అయితే ఇప్పటికే వివాదం నేపథ్యంలో చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని హిందూ సంఘాలు కోరుతున్నాయి.

అటు లీనాపై దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి.అటు కెనడాలోని హిందూ సంఘాలు కూడా ఈ పోస్టర్ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తూ అక్కడి అధికారులకు ఫిర్యాదు చేశాయి.

దీంతో కెనడాలోని ఇండియన్ హైకమీషన్ స్పందించింది.ఇలాంటి రెచ్చగొట్టే విషయాలను తక్షణం వెనక్కి తీసుకోవాలని నిర్వాహకులను కోరింది.

Telugu Hindu, Indian, Kaali, Kali Matha, Rhythms Canada, Toronto-Telugu NRI

దీనిపై కమీషన్ ఓ ప్రకటన విడుదల చేసింది.‘‘ టొరంటోలో స్థిరపడిన భారత సంతతి ఫిల్మ్ మేకర్ లీనా మణిమేకలై రూపొందించిన ‘కాళీ’ అనే డాక్యుమెంటరీ పోస్టర్ లో కాళీకా దేవిని అభ్యంతరకరంగా చిత్రీకరించడంపై వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోనికి తీసుకున్నాం.టొరంటోలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఇందుకు సంబంధించిన ఆందోళనలను మాకు తెలియజేశారు.అనేక హిందూ సంఘాలు కూడా కెనడాలోని అధికారులను ఆశ్రయించినట్లుగా మాకు సమాచారం అందింది.అందువల్ల ఇలాంటి రెచ్చగొట్టే అంశాలన్నీంటినీ తక్షణం ఉపసంహరించుకోవాలని తాము కోరుతున్నామని’’.ఆ ప్రకటనలో తెలిపారు.

మరోవైపు వివాదంపై లీనా స్పందించారు.భారతదేశంలో సామాజిక, రాజకీయ పరిణామాలు ఏ స్థాయిలో దిగజారిపోతున్నాయో ఈ ఘటనతో అర్థమవుతోందన్నారు.

రాను రాను ఇండియా విద్వేషం, మతోన్మాదంలో కూరుకుపోతోందని లీనా ఎద్దేవా చేశారు.ఈ మాఫియాకు భయపడి తాను తన స్వేచ్ఛను వదులుకోను.

ఏం జరిగినా పర్లేదు, ఆ పోస్టర్ ను మాత్రం మార్చేది లేదని తేల్చిచెప్పారు.తాజాగా కెనడాలోని ఇండియన్ హైకమీషన్ ఆదేశాల నేపథ్యంలో లీనా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube