ఆ రెండు దేశాలకు వెళ్లొద్దు భారత ప్రభుత్వం హెచ్చరిక..!!

పశ్చిమ ఆసియాలో యుద్ధమేఘాలు అలుముకున్నాయి.ఇరాన్ ఇజ్రాయెల్( Israel, Iran ) దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.

 Indian Government Warns Not To Go To Iran And Israel Iran, Israel, India , Isr-TeluguStop.com

గత ఏడాది అక్టోబర్ నెల నుండి ఇజ్రాయెల్.హమాస్ మిలిటెంట్లతో పోరాడుతున్న సంగతి తెలిసిందే.

గాజాలో ఇజ్రాయెల్ భద్రతా బలగాలు పోరాడుతున్నాయి.ఇజ్రాయెల్ నుండి బందీలుగా తీసుకెళ్లిన వారిని వెనక్కి తీసుకురావడానికి… దాదాపు 7 నెలల నుండి ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

పరిస్థితి ఇలా ఉండగా ఇప్పుడు ఇరాన్.ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం అలుముకుంది.

రానున్న 48 గంటల్లో ఇరాన్.ఇజ్రాయెల్ పై దాడి చేసే అవకాశం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది.

దీంతో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.భారతీయులు ఎవరు ఇజ్రాయెల్.ఇరాన్ దేశాలకు వెళ్లొద్దని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.పశ్చిమ ఆసియా( West Asia )లో ప్రస్తుతం పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని పేర్కొంది.ఇజ్రాయెల్… ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉంది.కాబట్టి ఆ రెండు దేశాలలో పర్యటించవద్దు అని స్పష్టం చేయడం జరిగింది.ఇదే సమయంలో ఆ రెండు దేశాలలో ఉన్న భారతీయ పౌరులు రెండు దేశాలలో ఉన్న భారత రాయబార కార్యాలయాలలో తమ పేరు నమోదు చేసుకోవాలని కోరింది.ఇజ్రాయెల్… ఇరాన్ దేశాల మధ్య యుద్ధం.మూడో ప్రపంచ యుద్ధానికి( Third world war ) దారితీసే అవకాశం ఉందని.చాలామంది భయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube