ఇద్దరు టీనేజర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గాను సింగపూర్‌లో భారతీయుడికి( Singapore Indian ) కోర్ట్ జైలు శిక్ష విధించింది.నిందితుడిని 44 ఏళ్ల సుశీల్ కుమార్‌గా( Sushil Kumar ) గుర్తించారు.
ఈ నేరానికి గాను అతనికి 3 నెలల 4 వారాల జైలు శిక్ష విధించి కోర్ట్.కేసు పూర్వాపరాల్లోకి వెళితే.2022 ఆగస్ట్ 2న బూన్ కెంగ్ రైల్వే స్టేషన్ నుంచి నడుచుకుంటూ వస్తున్న 14 ఏళ్ల బాధితురాలిని సుశీల్ అడ్డగించాడు.మాట్లాడాలని చెబుతూ.
ఒక్కసారిగా బాలికను కౌగిలించుకున్నాడు.అక్కడితో ఆగకుండా బుగ్గలపై ముద్దులు పెట్టి, ఆమెతో సెల్ఫీలు దిగాడు.
డబ్బులు అవసరమైతే తనను అడగాలని.తనతో పాటు హోటల్‌కు వచ్చి భోజనం చేయాలని సుశీల్ బలవంతం చేశాడు.అనంతరం ఆమె దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని విడిచిపెట్టాడు.ఈ పరిణామంతో భయాందోళనలకు గురైన బాలిక.
ఇంటికి వెళ్లి తన తల్లితో జరిగిన విషయాన్ని చెప్పింది.దీంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కానీ సుశీల్ కుమార్ వేధింపులు అక్కడితో ఆగలేదు.ఫోన్ నెంబర్ ద్వారా బాలికకు వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టాడు.
ముద్దులతో కూడిన ఎమోజీలు పంపుతూ తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు.
అదే ఏడాది నవంబర్‌లో 19 ఏళ్ల మరో యువతిని కూడా సుశీల్ వేధించాడు.ఓ రోజున యువతి లిఫ్ట్ కోసం ఎదురుచూస్తుండగా.ఆమె వద్దకు వెళ్లిన నిందితుడు ఆ యువతి భుజం , చేతులను తడుముతూ అసభ్యంగా ప్రవర్తించాడు.
నేను నిన్ను ప్రేమిస్తున్నానంటూ చెప్పాడు.అతని బారి నుంచి తప్పించుకోవాలని యువతి ఎంతగా ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుశీల్ కుమార్‌ను అరెస్ట్ చేశారు.
ఈ రెండు ఘటనలపై పలు అభియోగాలు నమోదు చేసి కోర్ట్ ( Singapore Court ) ముందు హాజరుపరిచారు.ఈ నేరాలకు గాను సుశీల్‌కు జైలు శిక్ష విధిస్తూ జిల్లా జడ్జీ పాల్ చాన్ తీర్పును వెలువరించారు.సింగపూర్ చట్టాల ప్రకారం ఈ తరహా నేరాలకు పాల్పడే వారికి భారీ జరిమానా, రెండేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తూ వుంటారు.
కానీ సుశీల్‌కు మాత్రం కేవలం 3 నెలల నాలుగు వారాల జైలు శిక్ష మాత్రమే పడింది.