బూతు సినిమాలు మొబైల్‌ లో ఉండటంతో ఇండియన్‌ ను అరెస్ట్‌ చేసిన ఆస్ట్రేలియన్‌ పోలీసులు.. అసలు ఏమైందంటే

పలు ప్రపంచ దేశాలు పోర్న్‌ ను బ్యాన్‌ చేశాయి.

బూతు సినిమాల వల్ల యువత చెడి పోతున్నారనే ఉద్దేశ్యంతో ఇండియాలో కూడా ఆ సినిమాలను బ్యాన్‌ చేసిన విషయం తెల్సిందే.

అయితే ఇండియాలో బ్యాన్‌ ఉన్నా కూడా యదేచ్చగా ఆ సినిమాలు నడుస్తూనే ఉన్నాయి, సైట్స్‌ ఓపెన్‌ అవుతూనే ఉన్నాయి.ఆస్ట్రేలియాలో మాత్రం ఆ సినిమాలను బ్యాన్‌ చేశారు.

చిన్న పిల్లలతో ఉన్న ఆ సినిమాలను చూడటం, చిన్న పిల్లలతో చేసిన వీడియో మొబైల్‌ లో కలిగి ఉంటే కఠిన చర్యలు తప్పవు.తాజాగా ఒక ఇండియన్‌కు ఆస్ట్రేలియాలో ఆ పరిస్థితి ఎదురైంది.

ఇండియా నుండి ఆస్ట్రేలియా వెళ్తున్నాడు కనుక అక్కడ ఆ సినిమాలు బ్యాన్‌ ఉంటాయనే ముందు జాగ్రత్తతో ఆ యువకుడు తన ఫోన్‌ ను ఆ సినిమాలతో నింపేసుకున్నాడు.అక్కడికి వెళ్లిన తర్వాత ఇబ్బంది పడటం ఎందుకు అనుకుని అన్ని లగేజీలతో పాటు, వాటిని కూడా క్యారీ చేశాడు.అయితే పెర్త్‌ విమానాశ్రయంలో ఆ వీడియోలను అక్కడి అధికారులు చూసి అవాక్కయ్యారు.

Advertisement

వందల కొద్ది ఉన్న వీడియోలను చూసి అతడిపై కేసు నమోదు చేశారు.ఆస్ట్రేలియాకు ఇలాంటి వీడియోలతో రావడంకు అక్కడి అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు.

ఆ సినిమాల విషయంలో ఆస్ట్రేలియాలో కఠినమైన చట్టాలు అమలు అవుతున్నాయి.ఒక వ్యక్తి ఫోన్‌లో వీడియో ఉందని, మరో వ్యక్తికి తెలిసి, ఆ సమాచారం పోలీసులకు ఇవ్వకుంటే ఇద్దరిపై కూడా కేసు నమోదు చేసేలా అక్కడ చట్టాలు ఉన్నాయి.పిల్లలను ఆ సినిమాలకు బానిస కాకుండా చేసేందుకు అక్కడి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది.

ఇలాంటి చట్టాలు ఇండియాలో కూడా వస్తే బాగుండేది కదా, ఇండియాలో మరీ దారుణంగా 15 ఏళ్లకు అటు ఇటుగా ఉన్న పిల్లలే ఆ సినిమాలను తెగ చూస్తున్నట్లుగా ఒక సర్వేలో వెళ్లడయ్యింది.ప్రభుత్వానికి చిత్తసుద్ది లేకుంటే మరెన్ని దారుణాలు జరుగుతాయో.ఇండియాలో బ్యాన్‌ ఉన్నా కూడా ఆ వీడియోలను సదరు వ్యక్తి ఆస్ట్రేలియా వరకు తీసుకు వెళ్లాడంటే ఇండియాలో అధికారులు ఏ స్థాయిలో పని చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు