బంగ్లాదేశ్‌లో హిందువులపై పెరుగుతున్న హింస .. అమెరికాలో ప్రవాస భారతీయుల నిరసన

షేక్ హాసీనా( Sheikh Hasina ) ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత బంగ్లాదేశ్‌లో( Bangladesh ) కల్లోల పరిస్ధితులు నెలకొన్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా ముస్లిమేతర వర్గాలను ఆందోళనకారులు టార్గెట్ చేస్తున్నారు.

 Indian-americans Plan Protests In Us Against Attacks On Hindus In Bangladesh Det-TeluguStop.com

ప్రధానంగా హిందువుల( Hindus ) ఆస్తులు, ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు.కొద్దిరోజుల క్రితం ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్‌ను( Chinmoy Krishna Das ) అరెస్ట్ చేయడంతో పరిస్ధితులు నానాటికీ దిగజారిపోతున్నాయి.

ఈ వివాదం సద్దుమణగకముందే బంగ్లాదేశ్‌లో మరో ఇస్కాన్ కేంద్రంపై దుండగులు దాడికి తెగబడినట్లుగా ఇస్కాన్ తెలిపింది.

Telugu Hindus, Bangladesh, Chinmoykrishna, Hindu, India, Sheikh Hasina, Nris-Tel

బంగ్లాదేశ్ జాతీయ పతాకాన్ని ఉద్దేశించి అభ్యంతర వ్యాఖ్యలు చేసిన చిన్మయ్ కృష్ణదాస్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా.ఆయన తరపున వాదించిన న్యాయవాదిని స్థానికులు కొట్టి చంపారు.మరో న్యాయవాది లోపలికి అడుగుపెట్టకుండా అడ్డుకోవడంతో చిన్మయ్ బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం దాదాపు నెల రోజుల పాటు వాయిదా వేసింది.

బంగ్లాదేశ్‌లోని పరిస్థితులపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.ర్యాలీలు, సభలు, సమావేశాలను టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని బ్రిటన్ ఇప్పటికే హెచ్చరించింది.

ఈ పరిస్ధితుల నేపథ్యంలో అక్కడ ఎప్పుడెం జరుగుతుందో తెలియని పరిస్ధితి నెలకొంది.

Telugu Hindus, Bangladesh, Chinmoykrishna, Hindu, India, Sheikh Hasina, Nris-Tel

ఈ నేపథ్యంలో అమెరికాలోని ప్రవాస భారతీయులు( US NRI’s ) ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.బంగ్లాదేశ్‌లో హిందువులపై( Bangladesh Hindus ) జరుగుతున్న దాడులకు నిరసనకు చికాగోలో( Chicago ) శాంతి ర్యాలీలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.హిందూ యాక్షన్( Hindu Action ) డిసెంబర్ 9న వైట్ హౌస్ సమీపంలో మార్చ్ ను నిర్వహిస్తుండగా , ఆదివారం చికాగోలో ప్రముఖ కమ్యూనిటీ నేతలు ర్యాలీకి ఏర్పాట్లు చేస్తున్నారు.

బంగ్లాదేశ్ లో పరిస్థితి కేవలం ప్రాంతీయ సంక్షోభం కాదు.ఇది ప్రపంచంపై తీవ్ర పరిణామాలు చూపిస్తుందని భారతీయ అమెరికన్లు హెచ్చరిస్తున్నారు.బంగ్లాదేశ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని ప్రజలను రక్షించాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజంపై ఉందని అంటున్నారు.ఇటీవలి కాలంలో హిందువులపై హింస దిగ్భ్రాంతికరమైన స్థాయికి పెరిగిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube