US Midterm Elections : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో సత్తా చాటిన “ఇండో అమెరికన్స్”

అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఏ పార్టీ ఎలాంటి విజయాన్ని కైవసం చేసుకుందనేదానికంటే కూడా ఎంత మంది భారతీయులు ఈ ఎన్నికల్లో విజయం సాధించారు అనే విషయంపైనే ఇండో అమెరికన్స్ అందరూ దృష్టి పెట్టారు.ప్రతీ భారతీయుడు కూడా పార్టీ లతో సంభంధం లేకుండా మన భారతీయులు ఎంత మంది గెలిచారు అనే ఆతృతను కనబరిచారు.

 Indian Americans In Race For Us Mid Term Election,us Mid Term Election, Ro Khann-TeluguStop.com

అయితే అధికార డెమోక్రటిక్ పార్టీ కి చెందిన ఈ నలుగురు ఇండో అమెరికన్స్ ప్రతినిధుల సభకు ఎన్నికవ్వడమే కాదు భారీ విజయాన్ని కైవసం చేసుకున్నారు.

రాజా కృష్ణ మూర్తి, రో ఖాన్న, ప్రమీలా జయపాల్, తానే దార్ లు ప్రతినిధుల సభకు ఎన్నికైన వారిలో ఉన్నారు.

వీరిలో ఓ ఖన్నా, ప్రమీలా జయపాల్, రాజా కృష్ణ మూర్తిలు పోటీ చేయడం ఇది నాల్గవ సారి.ఇదిలాఉంటే వివిధ రాష్ట్రాలకు చెందిన చట్టసభల్లో ఎంతో మంది ఇండో అమెరికన్స్ పోటీ చేసి విజయం సాధించగా, కొందరు ఓటమిని చవి చూశారు.

ప్రముఖ వ్యాపార వేత్త తానే దార్ మిషిగాన్ నుంచీ పోటీ చేసి విజయం సాధించగా, ఇల్లినాయిస్ నుంచీ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న అదే అభ్యర్ధి రాజా కృష్ణ మూర్తి మరో సారి విజయం సాధించారు.అలాగే

Telugu America, Ro Khanna, Shrithanedar, Mid Term-Telugu NRI

సిలికాన్ వ్యాలీ నుంచీ రో ఖన్నా, వాషింగ్టన్ నుంచీ ప్రమీలా జయపాల్ విజయం సాధించారు.చట్ట సభల ఎన్నికల్లో సైతం ప్రవాస భారతీయుల హవా కొనసాగింది.మేరీ ల్యాండ్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా ఏపీ మూలాలున్న మహిళ అరుణ మిల్లర్, ఎన్నికయ్యి చరిత్ర సృష్టించారు, అగ్ర రాజ్యంలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఎన్నికవ్వడం ఇదే ప్రప్రధమం.

ఇదిలాఉంటే టెక్సాస్ నుంచీ పోటీ చేసిన సందీప్ శ్రీ వాస్తవ పోటీ చేసి ఓటమి చెందారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube