అమెరికాలో భారత సంతతికి చెందిన రాజకీయవేత్తకు కీలక పదవి దక్కింది.కుమార్ పీ బార్వే(Kumar P Barve ) (64)ను మేరీల్యాండ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌లో నియమిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ వెస్ మూర్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ కమీషన్ మేరీల్యాండ్‌లో వ్యాపారాలు చేస్తున్న పబ్లిక్ యుటిలిటీలను, రవాణా సంస్థలను నియంత్రిస్తుంది.
గవర్నర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.1958, సెప్టెంబర్ 8న న్యూయార్క్‌లోని షెనెక్టాడీలో( Schenectady, New York ) భారతీయ తల్లిదండ్రులకు కుమార్ జన్మించారు.అనంతర కాలంలో బార్వే కుటుంబం మేరీల్యాండ్‌కు వెళ్లింది.అక్కడ సిల్వర్ స్ప్రింగ్‌లోని పెయింట్ బ్రాంచ్ హై స్కూల్‌లో ఆయన చదువుకున్నారు.1980లో జార్జ్‌టౌన్ యూనివర్సిటీ అనుబంధ మెక్‌డొనఫ్ స్కూల్ ఆఫ్ బిజినెస్( McDonough School of Business ) నుంచి అకౌంటింగ్‌లో పట్టభద్రుడయ్యారు.

అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టి.అమెరికాలోని రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు.1991 నుంచి హౌస్ ఆఫ్ డెలిగేట్స్‌లో కుమార్ సభ్యునిగా వున్నారు.2002 నుంచి 2015 వరకు హౌస్ ఆఫ్ డెలిగేట్స్ ( House of Delegates )మెజారిటీ లీడర్‌గానూ ఆయన పనిచేశారు.2015లో రవాణా, వ్యవసాయం, హౌసింగ్ , రియల్ ప్రాపర్టీ చట్టాన్ని పర్యవేక్షించే హౌస్ ఎన్విరాన్‌మెంట్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ కమిటీకి అధ్యక్షుడిగా నియమితులయ్యారు.2016లో మేరీల్యాండ్‌లోని 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌లో పోటీ చేసిన ఆయన.డెమోక్రాటిక్ ప్రైమరీలో సెనేటర్ జామీ రాస్కిన్ చేతిలో ఓడిపోయారు.

రాజకీయాలు, ప్రజాసేవకు గాను కుమార్‌ను అనేక అవార్డులు వరించాయి.2017లో లీగ్ ఆఫ్ కన్జర్వేషన్ వోటర్స్ లెజిస్టేటర్ ఆఫ్ ది ఇయర్, 2013లో ఇండియా అబ్రాడ్ లైఫ్‌టైమ్ సర్వీస్ అవార్డు సహా పలు అవార్డులను అందుకున్నారు.అయితే 2007లో మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినందుకు గాను కుమార్ బార్వేపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఈ క్రమంలో 2008లో ఆయన తన నేరాన్ని అంగీకరించడంతో న్యాయస్థానం జరిమానా విధించింది.