అమెరికాలో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల బాలుడు అరుదైన ఘనతను సాధించాడు.మంచినీటి ఏంజెల్ ఫిష్ (Pterophyllum scalare) డీఎన్ఏను విజయవంతంగా సీక్వెన్స్ చేసిన తొలి వ్యక్తిగా నిలిచాడు.
సిలికాన్ వ్యాలీలోని బేసిస్ ఇండిపెండెంట్ పాఠశాలలో చదువుకుంటున్న ఇండివర్ మాదిరెడ్డి ఈ ఘనత సాధించాడు.ఈ ఏడాది మార్చి ప్రారంభంలో తన పెంపుడు చేప కాల్విన్ మరణించడంతో ఈ ప్రయోగం చేశాడు.
ఒక కమ్యూనిటీ ల్యాబ్‌లో రెండు వారాంతాల్లోనే ఈ సీక్వెన్సింగ్ పూర్తి చేశాడు.అనంతరం ఈ ఏడాది అక్టోబర్ 18న తన పనిని వివరిస్తూ ఒక జర్నల్‌ను ప్రచురించాడు ఇండివర్.
తన పెంపుడు చేప చనిపోయినప్పటికీ.అది ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలని అనుకున్నట్లు మాదిరెడ్డి తెలిపాడు.
నా చేపకు నివాళి అర్పిస్తూనే.ఆ సమాచారాన్ని శాస్త్రీయ సమాజానికి అందించగలనని నమ్మకంతో ఏంజెల్‌ఫిష్ డీఎన్ఏను సీక్వెన్సింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు.
మంచినీటి ఏంజెల్‌ఫిష్ అమెజాన్ బేసిన్‌కు చెందినవి.పదేళ్ల జీవిత కాలాన్ని కలిగి వుంటాయి.పొడవైన, గంభీరమైన రెక్కలతో చూడగానే ఆకట్టుకునేలా వుంటాయి.జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియ ద్వారా జీవి కణ రకం, జన్యువు క్రమాన్ని నిర్ణయించడంలో సహాయపడుతుంది.
ఈ సీక్వెన్సింగ్ ప్రయోగం కోసం 2000 డాలర్లు ఖర్చవుతుందని అంచనా వేసిన మాదిరెడ్డి.క్రౌడ్ ఫండింగ్ ద్వారా 1000 డాలర్లకుపైగా సేకరించగలిగాడు.
ఎన్ఈబీ మోనార్క్ జెనోమిక్ డీఎన్ఏ ప్యూరిఫికేషన్ కిట్‌తో ఏంజెల్‌ఫిష్ జెనోమిక్ డీఎన్ఏను సేకరించినట్లు ఇండివర్ తన పరిశోధనా పత్రంలో తెలిపాడు.

ప్రయోగానికి ముందు .మాదిరెడ్డి జీనోమ్ సీక్వెన్సింగ్ సాంకేతికతలను సిద్ధం చేయడానికి, తెలుసుకోవడానికి నెల గడిపాడు.సీక్వెన్సింగ్ పూర్తయిన తర్వాత.
డేటాను విశ్లేషించడానికి రెండు నెలలకు పైగా గడిపాడు.మాదిరెడ్డి ఆక్వాటిక్ బయాలజీ ప్రపంచంలోకి ప్రవేశించడం ఇదే తొలిసారి కాదు.
గతంలో ఆయన చేపల ఆహారంలో ప్రోటీన్ సాంద్రత, ఇతర ప్రాజెక్ట్‌లలో నీటి కాలుష్యం మధ్య సంబంధాన్ని అధ్యయనం చేశాడు.ఎలుకల వెన్నుపూస, వైరల్ ఇన్ఫెక్షన్లు వంటి వాటిపైనా స్టడీ చేశాడు.







