మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు వెల్లడిలో ఆలస్యం జరుగుతుందని టీఆర్ఎస్, బీజేపీ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.ఈ వ్యాఖ్యలను ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఖండించారు.
కౌంటింగ్ పారదర్శకంగా జరుగుతోందని, ఎలాంటి అవకతవకలు జరగడం లేదని తెలిపారు.ఫలితాల ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం లేదని చెప్పారు.
ప్రతి టేబుల్ వద్ద పార్టీ అభ్యర్థుల ఏజెంట్లు ఉన్నారని తెలిపారు.ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి కొంత ఆలస్యం జరుగుతోందని వెల్లడించారు.
మొత్తం బరిలో 47 మంది అభ్యర్థులున్నారని చెప్పారు.ప్రతి అభ్యర్థి ఫలితాలు చూడాలని, అందుకే ఆలస్యం అవుతోందని పేర్కొన్నారు.
వెరిఫై చేసిన తర్వాతే ఫలితాలను అధికారికంగా అందిస్తామన్నారు.ప్రతి రౌండ్ కు అరగంటకు పైగా సమయం పడుతోందని తెలిపారు.
ఇందుకు గానూ మొత్తం 8 గంటల సమయం పడుతుందని ఆయన స్పష్టం చేశారు.







