హిందూ వాదం కోసం జీవితం అంకితం .. 4 మిలియన్ డాలర్లు విరాళమిచ్చిన ఇండో అమెరికన్ వైద్యుడు

హిందూ మతం( Hindu religion ) అనేది కేవలం ఒక మతం కాదని.ఒక జీవన విధానమన్నారు అమెరికాలో స్థిరపడిన ఓ భారత సంతతి వైద్యుడు.

 Indian-american Doctor Commits Usd 4 Million For Hindu Advocacy And Awareness In-TeluguStop.com

అగ్రరాజ్యంలో హిందూ వాదంపై అవగాహన, ఇతర ప్రచార కార్యక్రమాల కోసం 4 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు డాక్టర్ మిహిర్ మేఘాని( Dr.Mihir Meghani ) .రెండు దశాబ్ధాల క్రితం తన స్నేహితులతో కలిసి హిందూ అమెరికా ఫౌండేషన్‌ను స్థాపించారు మిహిర్.ఈ నెల ప్రారంభంలో జరిగిన వార్షిక సిలికాన్ వ్యాలీ గాలాలో వచ్చే ఎనిమిదేళ్లలో హిందూ మతం కోసం 1.5 మిలియన్ డాలర్లు విరాళంగా ఇవ్వాలని డాక్టర్ మిహిర్ ప్రతజ్ఞ( Dr.Mihir Pratajna ) చేశారు.బహుశా అమెరికాలో హిందూ మతం కోసం అతిపెద్ద భారతీయ అమెరికన్ దాత ఆయనే కావొచ్చు.

Telugu Hindu American, Hindu, Usd-Telugu NRI

నా భార్య , నేను ఇప్పటి వరకు హిందూ అమెరికన్ ఫౌండేషన్‌కు( Hindu American Foundation ) 1.5 మిలియన్ డాలర్లు విరాళంగా అందించామని మిహిర్ మేఘాని చెప్పారు.అలాగే ఇతర హిందూ, భారతీయ సంస్థలకు కూడా 15 ఏళ్లుగా మరో మిలియన్ డాలర్లు అందించామని ఆయన వెల్లడించారు.వచ్చే ఎనిమిదేళ్లలో తాము భారత్, హిందూ అనుకూల సంస్థలకు 1.5 మిలియన్ డాలర్లు ఇస్తామని మిహిర్ ప్రకటించారు.డాక్టర్ మేఘాని, అతని స్నేహితులు అసీమ్ శుక్లా (యూరాలజిక్ సర్జరీలో అసోసియేట్ ప్రొఫెసర్), సుహాగ్ శుక్లా (న్యాయవాది), నిఖిల్ జోషి (కార్మిక న్యాయవాది) కలిసి 2003 సెప్టెంబర్‌లో హిందూ అమెరికన్ ఫౌండేషన్ (హెచ్ఏఎఫ్)ని స్థాపించారు.అమెరికాలో హిందూ సమూహం తరపున వాదించే తొలి గ్రూప్ ఇదే.

Telugu Hindu American, Hindu, Usd-Telugu NRI

చాలా మంది అమెరికన్లు క్రిస్టియన్లు కావడం వల్ల చాలా మంది అమెరికన్లు హిందూ మతాన్ని అంత తేలిగా అర్ధం చేసుకోలేరని ఒక ప్రశ్నకు సమాధానంగా డాక్టర్ మేఘాని అన్నారు.భారత్ నుంచి వస్తున్న హిందువులు తమకు హిందూ గుర్తింపు, భారతీయ జాతీయ గుర్తింపు వుందని అర్ధం చేసుకోరని.తాము దాని గురించి మాట్లాడతామని మేఘాని చెప్పారు.హిందూ గుర్తింపు గురించి వారు చాలా గర్వంగా వుండాలని పేర్కొన్నారు.వాషింగ్టన్‌ డీసీలో హెచ్ఏఎఫ్( HAF in Washington DC ) సాధించిన తొలి విజయాలలో అమెరికాలో దీపావళికి గుర్తింపు పొందడం కీలకమైనది.హిందూ అమెరికన్ వార్షిక బడ్జెట్ ఇప్పుడు 2.5 మిలియన్లకు చేరింది.వచ్చే ఏడాది ఈ బడ్జెట్‌ను 5 మిలియన్ డాలర్లకు , దశాబ్ధం చివరి నాటికి 20 మిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube